
నాల్గోసారి ఉత్తమ స్కూల్‌గా..
కర్నూలు సిటీ: నగరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ మున్సిపల్ హైస్కూల్ రాష్ట్రస్థాయిలో ఉత్తమ స్కూల్‌కు ఎంపికై ంది. విజయవాడలో శుక్రవారం సీఎం నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అవార్డును ప్రధానోపాధ్యాయుడు కె.శివప్రసాద్ అందుకోనున్నారు. ఈ పాఠశాల 2018లో అడ్వాన్స్ ఫౌండేషన్ స్కూల్‌గా ఎంపికై ంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో (2020లో) భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజీ అబ్దుల్ కలాం పేరుతో స్కూల్ ఏర్పాటుకు కర్నూలు నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. ఈ తీర్మానం మేరకు 6 నుంచి 10వ తరగతి వరకు తరగతికి 60 సీట్ల చొప్పున అనుమతులు ఇస్తూ 2021 మార్చి 10న విద్యావాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బి.రాజశేఖర్ జీఓ ఎం.ఎస్ నంబరు 20ని జారీ చేశారు. ప్రవేశ పరీక్ష ద్వారా సీట్లు భర్తీ చేస్తున్నారు. తొలుత 2021–22లో , తర్వాత 2022–23లో, 2023–24లో పదో తరగతి విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణులు అయ్యారు. 2024–25 విద్యా సంవత్సరంలో 43 మంది పరీక్షలు రాస్తే 43 మంది పాసయ్యారు. ఈ స్కూల్‌కి చెందిన టి.సాయి లఖిత 595 మార్కులు సాధించింది. దీంతో వరుసగా నాల్గోసారి రాష్ట్ర స్ధాయిలో ఉత్తమ స్కూల్‌గా ఎంపికై ంది.
ఎరువుల దుకాణాలపై
విజిలెన్స్ దాడులు
వెల్దుర్తి: పట్టణంలోని ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ పవన్‌కిశోర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడుల్లో భాగంగా ముందుగా విజిలెన్స్ సిబ్బంది రైతుల రూపంలో అన్ని దుకాణాలకు వెళ్లి ధరలను విచారించారు. ఇందులో నాలుగు దుకాణాల్లో అధిక ధరలకు అమ్ముతున్నట్లు తెలుసుకున్నారు. ఆయా దుకాణాలపై వెంటనే విజిలెన్స్ సీఐ, ఆ శాఖ ఏఓ విశ్వనాథ్, స్థానిక ఏఓ అక్బర్ బాషా దాడులు చేసి ముందుగా లైసెన్స్, రికార్డులు, స్టాకు పరిశీలించారు. ఎంఆర్‌పీ కంటే ఎక్కువగా అమ్ముతున్నారని గుర్తించి నాలుగు దుకాణాలలోని 390 బస్తాల రూ.3,74,407ల విలువైన ఎరువుల అమ్మకాల నిలిపివేస్తూ, నిత్యావసరాల చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఏఓ తెలిపారు.
పోతిరెడ్డిపాడు నుంచి
నీటి విడుదల తగ్గింపు
జూపాడుబంగ్లా: పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి నీటి విడుదలను 32 వేల నుంచి 22 వేల క్యూసెక్కులకు తగ్గించినట్లు ఏఈ విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. ఐదు రోజుల నుంచి నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలతో దిగువప్రాంతాల్లోని కాల్వలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ముందు జాగ్రత్త చర్యగా నీటి విడుదలను తగ్గించామన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ గేట్లను కిందికి దించి 22 వేల క్యూసెక్కుల నీటిని ఎస్సారెమ్సీ కాల్వలోకి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ నీటిని తెలుగుగంగ క్వాకు 8వేల క్యూసెక్కులు, ఎస్సార్బీసీ నుంచి జీఎన్‌ఎస్‌ఎస్‌కి 9వేలు, కేసీ ఎస్కేప్ కాల్వకు 5వేల క్యూసెక్కులు సరఫరా చేస్తున్నట్లు బానకచర్ల ఏఈ దేవేంద్ర తెలిపారు.