
ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా
కర్నూలు(సెంట్రల్): స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ప్రతి ఇంటిపై మువ్వన్నెల జాతీయ పతకాన్ని ఎగురవేయాలని కలెక్టర్ పి.రంజిత్‌బాషా జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ గాంధీ విగ్రహం ఎదుట కలెక్టర్ పి.రంజిత్‌బాషా దంపతులు, జిల్లా అఽధికారులు మువ్వన్నెల జాతీయ జెండాలు చేతబట్టి, క్యాండిల్ లైట్‌లతో తిరంగా కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ హర్ ఘర్ తిరంగా సెల్ఫీ పాయింట్‌లు/బూత్‌లు ఏర్పాటు చేసి సెల్ఫీలను www.harfharthiranfa.comలో అప్‌లోడ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు ఆగస్టు 15వ తేదీన దేశ భక్తి ఉట్టిపడేలా భక్తిగీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్నారు. తిరంగా బైక్/సైకిల్ ర్యాలీలను ఏర్పాటు చేయాలన్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాలయాల్లో తిరంగా ప్రదర్శనలు, రంగోలి పోటీలు, రాఖీ తయారీ, వర్కుషాపులను నిర్వహించేలా విద్యాశాఖ చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సెట్కూరు సీఈఓ వేణుగోపాల్, జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, డీఈఓ శామ్యూల్‌పాల్ పాల్గొన్నారు.
సెల్ఫీలను హర్ ఘర్ తిరంగా సైట్‌లో
అప్‌లోడ్ చేయండి