పెద్దకడబూరు: తెలుగుదేశం పార్టీ నుంచి ముచ్చగిరి గ్రామానికి చెందిన నాయకులు బుధవారం వైఎస్సార్‌సీపీలోకి చేరారు. ఎమ్మిగనూరులోని ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి స్వగృహంలో వీరిని పార్టీ కండువా కప్పి వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు వై.ప్రదీప్‌రెడ్డి ఆహ్వానించారు. ముచ్చగిరి సర్పంచ్ హనుంతు, నాయకులు సురేష్‌గౌడ్, మాజీ డీలర్ నాగప్ప ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి సమక్షంలో బోయ తాయప్ప, బోయ శివారెడ్డి, బోయ గోవిందు, రంగస్వామి, నాగరాజు, రామాంజి, గురురాజు, రంగస్వామితో పాటు మరో 20 కుటుంబాల వారు వైఎస్సార్‌సీపీలో చేరారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కలసికట్టుగా పనిచేసి పార్టీ సత్తా ఏమిటో చూపిద్దామని వై.ప్రదీప్‌రెడ్డి పిలుపునిచ్చారు.
ఉరుకుంద హుండీ ఆదాయం రూ.92 లక్షలు
కౌతాళం: జిల్లాలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలలో ఒకటైన ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయంలో శ్రావణమాసం నాలుగు రోజులకు భక్తులు సమర్పించిన కానుకలను బుధవారం లెక్కించారు. హుండీ లెక్కింపు ఆలయ డిప్యూటీ కమిషనర్ విజయరాజు ఆధ్వర్యంలో చేపట్టారు. ఇందులో స్వామి వారికి నగదు రూపంలో రూ.92,09,323 వచ్చిందన్నారు. అలాగే వెండి 23కిజిల 100గ్రాములు, బంగారం 19గ్రాముల 500మిల్లిగ్రాములు, కొంత విదేశీ కరెన్సీ వచ్చినట్లు వెల్లడించారు. లెక్కింపు కార్యక్రమంలో దేవాలయ సిబ్బందితో పాటు ప్రధాన అర్చకుడు ఈరప్పస్వామి, ఉపప్రధాన అర్చకుడు మహదేవస్వామి, ముఖ్యఅర్చకుడు నాగరాజ్‌స్వామి, ఆదోని ఎండోమెంట్ ఇన్‌స్పెక్టర్, ఆలయ పర్యవేక్షకుడు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
చేపల పెంపకంపై మూడు నెలల శిక్షణ
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో 7వ తరగతి చదివిన నిరుద్యోగులకు చేపల పెంపకంపై మూడు నెలల శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ రంగనాథబాబు తెలిపారు. స్థానిక బంగారుపేటలోని దేశీయ మత్స్య శిక్షణా కేంద్రంలో సెప్టెంబర్ 1 నుంచి నవంబర్ 30వ తేదీ వరకు 144వ జట్టుకు శిక్షణ ఇస్తున్నట్లు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ నెల 29లోగా దరఖాస్తులను బంగారుపేటలోని తమ కార్యాలయంలో అందజేయాలన్నారు. ఈ నెల 30న ఽఉదయం 10.30 గంటలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరు కావా లని కోరారు. వివరాలకు మత్స్య శాఖ ఉప సంచాలకులు, బంగారుపేట, రైల్వేస్టేషన్ రోడ్డులోని కార్యాలయలలో సంప్రదించాలన్నారు.

టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిక