
కుక్కను తప్పించబోయి..!
అప్పుడు
ప్రజా ఉద్యమాలకు సిద్ధమవుదాం
హాస్టల్‌లో కనీస వసతులు కరువు
ఉద్యోగ విరమణ రోజే మృతి
గుంతకల్లు రూరల్: వైద్య, ఆరోగ్య శాఖలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీరస్‌గా పనిచేస్తు న్న వసుంధర గురువారం తన స్వగృహంలో మృతి చెందారు. గుంతకల్లు మండలం కసాపురం గ్రామానికి చెందిన ఆమె విడపనకల్లు పీహెచ్‌సీ, కర్నూలు జిల్లా పగిడిరాయి పీహెచ్‌సీలో పని చేశారు. ప్రస్తుతం పత్తికొండ మండలం పుచ్చకాలమాడ పీహెచ్‌సీలో పనిచేస్తున్నారు. సర్వీసు పూర్తి కావడంతో గురువారం ఆమె ఉద్యో గ విరమణ పొందాల్సి ఉంది. అయితే గత కొద్ది రోజులుగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వసుంధర.. ప్రస్తుతం ఇంట్లోనే ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో గురువారం కర్నూలు జిల్లా డిప్యూటీ డీఎంహెచ్‌ఓ, ఇతర సిబ్బంది ఆమె ఇంటికి చేరుకుని పరామర్శించి వెళ్లారు. వారు వెళ్లిన కొద్దిసేపటికే మధ్యాహ్నం 1.30 గంటలకు కన్నుమూశారు.
తాటి చెట్టు చెప్పెను.. వానల్లేవని!
ఎందుకో.. ఏమో వరుణుడు మొహం చాటేశాడు. రోజూ ఆకాశంలో కమ్ముకుంటున్న మబ్బులు వర్షిస్తాయని అనుకుంటుండగానే కాసేపటికే మాయమవుతున్నాయి. నీటి కోసం చెరువులు నోరెళ్లబెట్టాయి. వేసవిలో ఎండిన వాగులు, వంకలు కుంటలు నీళ్ల కోసం అర్రులు చాస్తున్నాయి. ఇందుకు తమ్మరాజుపల్లె గ్రామం వద్ద ఎస్ టర్నింగ్ వద్ద ఉన్న జాతీయ రహదారి పక్కన ఉన్న కుంటనే నిదర్శనం. గతేడాది జూలై మొదటి వారంలోనే ఈ కుంట నిండటంతో మూగజీవాల దాహార్తి తీరింది. ప్రస్తుతం ఎండిపోయిన కుంటలో ఎత్తైన తాటి చెట్టు వరుణుడు కరుణ కోసం ఆకాశం వైపు చూస్తున్నట్లుగా కనిపిస్తోంది.
– పాణ్యం
ఇప్పుడు
డోన్ టౌన్: ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వంపై పోరాడేందుకు ప్రజా ఉద్యమాలకు సిద్ధమవుదామని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముపాళ్ల నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయు లు, నంద్యాల జిల్లా కార్యదర్శి రంగనాయుడు పిలుపునిచ్చారు. నంద్యాల జిల్లా రెండవ మహా సభలో భాగంగా రెండవ రోజు గురువారం మార్కెట్‌యార్డు సమీపంలోని క్రిష్టియన్ హాలులో జిల్లా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏడాది పాలనలోనే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నాయన్నా రు. కూటమి నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు పోరాడదామన్నారు. పేదలకు ఇంటి స్థలాలు వంకల్లో వాగుల్లో ఇస్తూ.. బడా బాబులకు పట్టణం నడిబోడ్డున, విలువైన భూములు అప్పనంగా అప్పజెబుతున్నారని ఆరోపించారు.
నూతన కమిటీ: సమావేశం అనంతరం నంద్యాల జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కార్యదర్శిగా రంగనాయుడు రెండవ సారి ఎన్నికయ్యా రు. సహాయ కార్యదర్శిగా బాబా ఫకృద్ధీన్‌తో పాటు జిల్లా కార్యవర్గ సభ్యులుగా 15 మందిని, జిల్లా సమితి సభ్యులుగా 40 మందిని ఎన్నుకున్నారు. ఇందులో డోన్‌కు చెందిన కౌన్సిలర్ సుంకయ్య, రాధాకృష్ణ, రఘురామమూర్తి, ప్రసాద్, భాస్కర్, నాగరాము డు, రమేష్, మోటా రాముడు, నారాయణ ఎన్నికయ్యారు.
కర్నూలు సిటీ: నగర శివారులో జి.పుల్లయ్య ఇంజినీరింగ్ కాలేజీ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళా టీచర్ దంపతులు గాయపడ్డారు. కర్నూలు రూరల్ మండల పరిధిలోని పసుపుల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఎస్‌జీటీ టీచర్‌గా ఇందిర పని చేస్తున్నారు. గురువారం ఉదయం ఆమె భర్త భాస్కర్‌తో కలసి బైక్‌పై పాఠశాలకు బయలుదేరారు. వెంకాయపల్లె సమీపంలోని జి.పుల్లయ్య ఇంజినీరింగ్ కాలేజీ దాటిన తర్వాత పెట్రోల్ బంక్ ఎదురుగా ద్విచక్ర వాహనానికి కుక్క అడ్డువచ్చింది. దానిని తప్పించే ప్రయత్నంలో అదుపు తప్పి భార్యాభర్తలు కింద పడటంతో తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం 108లో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇందిర తలకు తీవ్ర గాయాలు కావడంతో మాట్లాడలేని పరిస్థితులో ఉంది. విషయం తెలుసుకున్న జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.శ్యామూల్ పాల్, ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి.హృదయరాజు ఆసుపత్రికి చేరుకుని గాయపడిన దంపతులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి అధికారులను కోరారు. ఇందిర పరిస్థితి కొంత విషమంగా ఉండడంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. గాయపడిన భర్త భాస్కర్ జనరల్ హాస్పిటల్‌లోనే చికిత్స పొందుతున్నారు.
మహిళా టీచర్ దంపతులకు గాయాలు

కుక్కను తప్పించబోయి..!

కుక్కను తప్పించబోయి..!

కుక్కను తప్పించబోయి..!

కుక్కను తప్పించబోయి..!