
వచ్చే ఎన్నికల్లోనూ ఇదే విజయాన్ని సాధిద్దాం
కర్నూలు (టౌన్): స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వచ్చిన విజయాన్నే వచ్చే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ సాధిద్దామని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. నగర పాలక స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఏకపక్షంగా గెలిచి మునెమ్మ, షేక్ అహమ్మద్, వెంకటేశ్వర్లు, సాంబశివరావు, నారాయణ రెడ్డి శుక్రవారం నియామక ధ్రువపత్రాలు అందుకున్నారు. అనంతరం వీరు ఎస్వీ కాంప్లెక్స్‌లో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డిని కలిశారు. వారికి ఎస్వీ మోహన్ రెడ్డిని అభినందనలు తెలిపి మాట్లాడారు. నాలుగేళ్ల పాటు కర్నూలులో ఎన్నో అభివృద్ధి పనులు చేశామన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినా గతేడాది నిర్వహించిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులే గెలిచారన్నారు. ఓటమి భయంతో ఈ ఏడాది ఎన్నికల్లో నిలబడేందుకు టీడీపీ సాహసించలేదన్నారు. ప్రజలతో మమేకమైన ఎనిమిది నెలల వ్యవధిలో వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేద్దామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు విక్రమ సింహారెడ్డి, కృష్ణకాంత్ రెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్, మల్లి పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
ఎస్వీ మోహన్ రెడ్డి