
బీజేపీని వీడి సొంత గూటికి
ఆదోని రూరల్: మేజర్ గ్రామ పంచాయతీ మండిగిరికి చెందిన మాజీ విద్యాకమిటీ చైర్మన్ ఉలిగప్ప సొంతగూటికి చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి సమక్షంలో శుక్రవారం వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వైఎస్సార్ అభిమానిగా ఉన్న ఉలిగప్ప వైఎస్సార్సీపీలో సీనియర్ నాయకుడిగా కొనసాగారన్నారు. విద్యాకమిటీ చైర్మన్‌గా ఐదేళ్లపాటు బాధ్యతలు కూడా నిర్వర్తించారన్నారు. పార్టీకి ఎన్నో సేవలు అందించారని, అయితే కొన్ని ప్రలోభాలకు తలొగ్గి బీజేపీలో చేరారన్నారు. అక్కడ పొందలేక తిరిగి వైఎస్సార్సీపీలోకి చేరడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఉలిగప్ప మాట్లాడుతూ.. బీజేపీలో ఎలాంటి అభివృద్ధి లేకపోవడంతో తిరిగి వైఎస్సార్సీపీలోకి వచ్చానన్నారు. కార్యక్రమంలో ఉలిగప్ప అనుచరులు 50 మంది పాల్గొన్నారు. వారందరికీ మాజీ ఎమ్మెల్యే కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
వైఎస్సార్‌సీపీలో చేరిన
మాజీ విద్యాకమిటీ చైర్మన్
కండువా వేసి ఆహ్వానించిన
మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి