
వైఎస్సార్‌సీపీ ‘మైనార్టీ’ విభాగం అధ్యక్షుడిగా హఫీజ్ ఖ
కర్నూలు (టౌన్): వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. వైఎస్సార్‌సీపీ పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ సభ్యులుగా హఫీజ్‌ఖాన్ ఉన్నారు.
జిల్లాకు కొత్తగా 3,502 వితంతు పింఛన్లు
కర్నూలు(సెంట్రల్): జిల్లాకు కొత్తగా 3,502 వితంతు పెన్షన్‌లు మంజూరయ్యాయి. కాగా, భర్తలు చనిపోయిన వృద్ధులకు మాత్రమే కొత్తగా వితంతు పెన్షన్‌లను మంజూరు చేశారు. అయితే 60 ఏళ్లు దాటిన వారికి కొత్తగా పింఛన్లు మంజూరు చేయకపోవడం గమనార్హం. కొత్తగా పెన్షన్‌లు మంజూరైన కల్లూరు మండలం చిన్నటేకూరుకు చెందిన కురువ అంజనమ్మ, బోయ లక్ష్మీదేవిలకు కలెక్టర్ తన చాంబర్‌లో పెన్షన్‌ను అందజేశారు.
పీఆర్ ఎస్‌ఈగా మద్దన్న
కర్నూలు(అర్బన్): పంచాయతీరాజ్ పర్యవేక్షక
ఇంజనీరు
(ఎఫ్‌ఏసీ)గా ఎస్‌సీఈ మద్దన్నకు బాధ్యతలు అప్పగిస్తూ ఆ శాఖ ఇంజనీరు ఇన్ చీఫ్ బాలునాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. రెగ్యులర్ ఎస్‌ఈగా విధులు నిర్వహించిన వి.రామచంద్రారెడ్డి జూలై 31న పదవీ విరమణ పొందారు. ఈ నేపథ్యంలోనే కర్నూలు పీఆర్ ఈఈగా విధులు నిర్వహిస్తున్న మద్దన్నకు ఎఫ్‌ఏసీపై ఎస్‌ఈగా బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా పలువురు డీఈఈ, ఏఈలు, కార్యాలయ సిబ్బంది ఆయనను కలిసి అభినందనలు తెలిపారు.
టెంకాయ
రూ.20 ప్రకారం అమ్మాలి
కౌతాళం: ఉరుకుంద ఈరన్నస్వామి ఆలయం వద్ద ఒక టెంకాయ రూ.20 ప్రకారం విక్రయించాలని ఆలయ డిప్యూటీ కమిషనర్ విజయరాజు ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రూ.20కే టెంకాయ అమ్మాలని పాటదారుడికి నోటీసు జారీ చేశామన్నారు. భక్తుల నుంచి ఫిర్యాదు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
నేరుగా అంబేద్కర్
గురుకులాల్లో ఖాళీ సీట్ల భర్తీ
కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులాల్లో మిగిలిపోయిన సీట్లను నేరుగా భర్తీ చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల కోఆర్డినేటర్ డాక్టర్ ఐ.శ్రీదేవి తెలిపారు. కౌన్సెలింగ్ అనంతరం కంబాలపాడు (బాలికలు), అరికెర (బాలురు) కళాశాలల్లో ఆర్ట్స్ గ్రూపుల్లో సీట్లు ఖాళీగా ఉన్నట్లు ఆమె శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతిలో రెగ్యులర్, సప్లిమెంటరీగా ఉత్తీర్ణులైన వారు నేరుగా ప్రవేశాలకు అర్హులన్నారు. అరికెర బాలుర కళాశాలలో సీఈసీలో ఎస్సీలకు 49, కంబాలపాడు బాలికల కళాశాలలో సీఈసీలో ఎస్సీలకు నాలుగు సీట్లు, బైపీసీ జనరల్ విభాగంలో ఒక సీటు ఖాళీగా ఉందన్నారు. అలాగే కర్నూలు జిల్లాలో 10వ తరగతిలో 24, సీనియర్ ఇంటర్మీడియట్‌లో 202, నంద్యాల జిల్లాలో 10వ తరగతిలో 16, సీనియర్ ఇంటర్మీడియట్‌లో 88 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. అర్హత కలిగిన వారు సంబంధిత కళాశాలల ప్రిన్సిపాల్స్‌ను సంప్రదించాలన్నారు. మరిన్ని వివరాలకు 9866616633/ 9010070219 నెంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.

వైఎస్సార్‌సీపీ ‘మైనార్టీ’ విభాగం అధ్యక్షుడిగా హఫీజ్ ఖ