
పరిశ్రమల స్థాపనకు గడువులోపు అనుమతులు
కర్నూలు(సెంట్రల్): పరిశ్రమల స్థాపనకు వీలుగా ఆయా శాఖలు నిర్దేశించిన గడువులోపు అనుమతులు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఎక్స్‌పోర్టు ప్రమోషన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగిల్ డెస్కు పోర్టల్ ద్వారా మే 30 నుంచి జూలై 30వ తేదీ వరకు 870 పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తులు రాగా 858 దరఖాస్తులను ఆమోదించామన్నారు. పీఎం విశ్వకర్మకు సంబంధించి 1,234 దరఖాస్తులు రాగా, 989 యూనిట్లకు రుణాలు మంజూరైనట్లు చెప్పారు. ఉత్పత్తిలోకి వచ్చిన కొత్త పరిశ్రమలు ప్రభుత్వానికి ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగాలు ఇస్తున్నారా లేదా అని ఏపీఐఐసీ జెడ్‌ఎం, పరిశ్రమల శాఖ జీఎంలను ఆరా తీశారు. ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్‌లో పరిశ్రమల ఏర్పాటుకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్‌లైతే బ్యాంకుల నుంచి రుణాలను మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం రూ.26.22 లక్షల పారిశ్రామిక రాయితీ విడుదలకు ఆమోదం తెలిపారు. పేదరిక నిర్మూలన(పీ4)లో పరిశ్రమల యాజమాన్యాలు భాగస్వామ్యం కావాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

పరిశ్రమల స్థాపనకు గడువులోపు అనుమతులు