
ఈరన్నస్వామి క్షేత్రం.. భక్తజన సంద్రం
దేవాలయం వద్ద భక్తుల రద్దీ
కౌతాళం: జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయంలో శ్రావణమాస ఉత్సవాల్లో భాగంగా మొదటి గురువారం భక్తుల రద్దీ కొనసాగింది. శ్రావణమాస ఉత్సవాల మొదటి గురువారం కావడంతో భక్తులు ఉదయం నుంచే స్వామి దర్శనానికి తరలిరావడంతో పుణ్యక్షేత్రం భక్త జనసంద్రంగా దర్శనమిచ్చింది. భక్తులు ఆలయ పరిసరాల్లో ప్రత్యేక వంటకాలను వండి స్వామి వారికి నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు తెల్లవారుజామున 4 గంటలకు సుప్రభాతసేవ, మహా మంగళహారతి, ఆకుపూజ, బిందుసేవ, పంచామృతాభిషేకం తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులను దర్శనానికి వదిలారు. స్వామి దర్శనం కోసం భక్తులు గంటకు పైగా వేచి ఉండాల్సి వచ్చింది. భక్తుల సౌక ర్యార్థం ఆలయ అధికారులు అతిశీఘ్ర దర్శనంతో పాటు ప్రత్యేక దర్శనం, శీఘ్రదర్శనం ఏర్పాటు చేశారు.

ఈరన్నస్వామి క్షేత్రం.. భక్తజన సంద్రం