చేతకాకుంటే వెళ్లిపో!
● ఎంపీడీఓపై ఓ వర్గం
టీడీపీ నాయకుల ధ్వజం
మద్దికెర: ‘అర్హులైన వారికి కాకుండా ఇష్టానుసారంగా బీసీ రుణాలు ఎలా మంజూరు చేస్తారని.. చేతకాకుంటే కార్యాలయం వదిలేసి వెళ్లిపో’ అంటూ మాజీ జెడ్పీటీసీ రాజన్నయాదవ్, టీడీపీ నాయకులు చంద్రశేఖర్‌గౌడ్, రామాంజులు ఎంపీడీఓ కొండయ్యపై ధ్వజమెత్తారు. బుధవారం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓను కలిసి బీసీ రుణాలకు సంబంధించి టీడీపీకి చెందిన ఒకే వర్గం నాయకుడు చెబితే రుణాలు ఎలా మంజూరు చేశారని ఎంపీడీఓతో వాగ్వాదానికి దిగారు. పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలకు కాకుండా పనికిరాని నాయకుడు చెప్పిన వారిని మాత్రమే ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నించారు. ‘ఎంపీడీఓగా నీవు పనికిరావు ఆఫీసు వదిలి వెళ్లిపో’ అంటూ తూలనాడారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ‘నా చేతుల్లో ఏమీ లేదు.. ఎమ్మెల్యే కేఈ శ్యామ్‌కుమార్ చెప్పిన వారికే మంజూరు చేయడం జరిగింది’ అంటూ చెప్పారు. ఈ సందర్భంగా విలేకరులు అందరికీ న్యాయం చేయాలని అడిగితే ఎవరైనా సరే ఎమ్మెల్యేని కలిసి రావాలని అప్పుడే రుణాలు మంజూరు చేస్తానని చెప్పడం గమనార్హం.


