రాయలసీమ రవాణాశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా లక్ష్మీకర్‌రెడ్డి | - | Sakshi
Sakshi News home page

రాయలసీమ రవాణాశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా లక్ష్మీకర్‌రెడ్డి

Mar 10 2025 10:35 AM | Updated on Mar 10 2025 10:30 AM

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌: రవాణాశాఖలో రాయలసీమ స్థాయిలో నాన్‌ టెక్నికల్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ (ఏపీటీడీ ఎన్‌టీఈఏ)కు సంబంధించి సీమ అధ్యక్షుడిగా పెద్దిరెడ్డి లక్ష్మీకర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈయన వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఎన్నికకు సంబంధించి ఫిబ్రవరి 22న నోటిఫికేషన్‌, 9న నామినేషన్‌ ప్రక్రియ నిర్వహించారు. ఎన్నికల అధికారి ఎం.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కడపలోని ఓ కల్యాణ మండపంలో నిర్వహించిన ఎన్నిక కార్యక్రమంలో అధ్యక్షుడిగా లక్ష్మీకర్‌రెడ్డి, జోన్‌ అసోసియేట్‌ ప్రెసిడెంట్‌గా ఈవై ప్రకాశ్‌ (అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌,కడప), జోన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌–1గా కె.సువర్ణకుమారి (అడ్మినిస్ట్రేషన్‌ ఆఫీసర్‌, అనంతపురం), జోన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌–2గా టీఎన్‌ పురుషోత్తంరెడ్డి (సీనియర్‌ అసిస్టెంట్‌, చిత్తూరు), జోన్‌ వైస్‌ప్రెసిడెంట్‌–3గా ఎస్‌.మనోహర్‌బాబు (జూనియర్‌ అసిస్టెంట్‌, ఆదోని), జోన్‌సెక్రటరీగా టి.విజయ్‌కుమార్‌ (అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌, మదనపల్లె), జోన్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా ఓ.యువ కిశోర్‌ (సీనియర్‌ అసిస్టెంట్‌, తిరుపతి), జోన్‌ జాయింట్‌ సెక్రటరీ–1గా డి.నసీరుద్దీన్‌ (సీనియర్‌ అసిస్టెంట్‌, కర్నూలు), జోన్‌ జాయింట్‌ సెక్రటరీ–2 ఓ.నాగరాజ (సీనియర్‌ అసిస్టెంట్‌, మదనపల్లె), జోన్‌ జాయింట్‌ సెక్రటరీ–3 పి.చక్రపాణి (అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌, చిత్తూరు), జోన్‌ ట్రెజరర్‌గా ఎన్‌.రవిప్రకాశ్‌ (సీనియర్‌ అసిస్టెంట్‌, హిందూపురం)లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికై న 11 మందిని పలువురు రవాణాశాఖలో పనిచేసే ఉద్యోగులు, టెక్నికల్‌ సిబ్బంది ఘనంగా సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement