
అబ్దుల్‌హమీద్, ఇలియాస్ బాషాలను సత్కరిస్తున్న ప్రభుత్వ వాహన డ్రైవర్లు
కర్నూలు(అగ్రికల్చర్): ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంక్షేమానికి కృషి చేస్తానని ఆల్ ఇండియా గవర్నమెంట్ డ్రైవర్స్ ఫెడరేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జి.అబ్దుల్‌హమీద్ తెలిపారు. కర్నూలు జిల్లాకు చెందిన ప్రభుత్వ వాహన డ్రైవర్లు అయిన అబ్దుల్‌హమీద్, ఎస్.ఇలియాస్ బాషాలకు ఆల్ ఇండియా గవర్నమెంట్ డ్రైవర్స్ ఫెడరేషన్‌లో కీలకమైన పదవులు లభించాయి. ఈ నేపథ్యంలో ఆదివారం కర్నూలు ఏడీఏ కార్యాలయం ప్రాంగణంలో అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్దుల్‌హమీద్ మాట్లాడుతూ.. 2006 నుంచి 2016 వరకు జిల్లా అధ్యక్షుడిగా తాను అందించిన సేవలను గుర్తించారన్నారు. డ్రైవర్లు ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఫెడరేషన్ జాయింట్ సెక్రటరీ ఇలియాస్ బాషా మాట్లాడుతూ.. ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంక్షేమానికి మరింత పాటు పడతామన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ వాహన డ్రైవర్లు బాలస్వామి, షబ్బీర్‌బాషా, విజయకుమార్, శ్రీనివాసులు, మగ్బుల్ తదితరులు పాల్గొన్నారు.