జిల్లా వాసులకు ఉగాది పురస్కారాలు | - | Sakshi
Sakshi News home page

జిల్లా వాసులకు ఉగాది పురస్కారాలు

Mar 19 2026 7:38 AM | Updated on Mar 19 2026 7:38 AM

బ్యాక్‌లాగ్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి శ్రీశైలంలో కోర్టు ఏర్పాటుకు ఉత్తర్వులు

కర్నూలు కల్చరల్‌: జిల్లాకు చెందిన పలువురు ప్రముఖులు రాష్ట్ర ప్రభుత్వం ప్రదానం చేసే రాష్ట్ర స్థాయి పురస్కారాలకు ఎంపికయ్యారు.సాహిత్య, చరిత్ర, సంస్కృతి రంగాల్లో విశేష కృషి చేస్తున్న కురాడి చంద్రశేఖర కల్కూరకు ‘కళా రత్న’ (హంస) పురస్కారం, సాహిత్య రంగంలో విశేష సేవలు అందిస్తున్న నంద్యాలకు చెందిన డాక్డర్‌ వీడీవీ రమణమూర్తి, గాయకుడు, సంగీత దర్శకుడు విశ్వనాథ్‌ రామ అయ్యర్‌ (కర్నూలు), సాహిత్యంలో గద్వాల సోమన్న (కర్నూలు), నాటక రంగంలో నీలం ఓంకార స్వామి (కర్నూలు), సూక్ష్మ చిత్రాలులో శివ కేశవ మచాని (కర్నూలు), సామాజిక సేవలో బీసీ రాజమోహన్‌ రెడ్డి (నంద్యాల), సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూఎన్సర్‌ అబ్బాయి కాంత్‌ (నంద్యాల) లకు ‘ఉగాది’ పురస్కారాలు ప్రకటించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శుక్రవారం ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే ఉగాది వేడుకల్లో వారికి పురస్కారాలు అందించనున్నారు.

రిటైర్డ్‌ ఏజేసీ మృతి

కర్నూలు(సెంట్రల్‌): కర్నూలు జిల్లా డీఆర్వో, అడిషనల్‌ జాయింట్‌ కలెక్టర్‌గా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన రామస్వామి గుండెపోటుతో కన్నుమూశారు. బుధవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు వచ్చి వెళ్తుండగా ఆయన గుండెపోటుకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే అంబులెన్స్‌లో నగరంలోని అమ్మా హాస్పిటల్‌కు తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా, రామస్వామి జిల్లా అధికారులకు ఎంతో సుపరిచితులు. ఈనేపథ్యంలో ఆయన మృతి సమాచారం తెలుసుకున్న పలువురు అధికారులు నివాళి అర్పించారు. కర్నూలు ఆర్‌డీఓ కె.సందీప్‌కుమార్‌, కర్నూలు అర్బన్‌, రూరల్‌ తహసీల్దార్లు రవికుమార్‌, రమేష్‌బాబు ఆయన పార్థివదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

కర్నూలు(అర్బన్‌): ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2025–26 సంవత్సరానికి అర్హులైన విభిన్న ప్రతిభావంతులు(దివ్యాంగులు) బ్యాక్‌లాగ్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయో వృద్ధుల సంక్షేమ శా ఖ సహాయ సంచాలకులు రయీస్‌ఫాతిమా బుధవారం ఒక ప్రకటనలో తెలిపా రు. గ్రూపు–4 పో స్టులు 9, క్లాస్‌–4 పోస్టులు 8 ఖాళీగా ఉన్నా యన్నారు. ప్రతి పోస్టుకు విద్యార్హత, కేటగిరీలలో ఖాళీల వివరాలు, నమూనా దరఖాస్తుతో కూడిన వివరాలకు వెబ్‌సైట్‌ www.kurnool. ap.gov.in, www.nandyal.ap.gov.inలో పొందుపరిచామన్నారు.వివరాలకు 08518–277864 నెంబర్‌ను సంప్రదించాలన్నారు. దరఖాస్తులను ఈ నెల 31వ తేది సాయంత్రం 5 గంటల్లోపు సహా య సంచాలకులు, విభిన్న ప్రతిభావంతు లు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌, కర్నూలులో అందజేయాలన్నారు.

శ్రీశైలం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మహా క్షేత్రంలో ఎట్టకేలకు శ్రీశైలంలో ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రే ట్‌ కోర్టు ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సిఫార్సును ప్రభుత్వం అంగీకరించడంతో హైకోర్టు రిజిస్టర్‌ వీఎస్‌ఎస్‌ శ్రీనివాస శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఉమ్మడి కర్నూలు జిల్లా తో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ సెషన్‌ జడ్జెస్‌కు హైకోర్టు రిజిస్టార్‌ నుంచి ఉత్తర్వులు అందాయి. కాగా అనేక సంవత్సరాలుగా శ్రీశైలంలో క్యాంప్‌ కోర్టు మాత్రమే ఉంది. అది కూడా నెలలో రెండవ శుక్రవారం నాలుగో శుక్రవారం మాత్రమే సీనియర్‌ సివిల్‌ జడ్జి ఆధ్వర్యంలో నడుస్తోంది. ప్రస్తుతం దేవస్థానం టోల్గేట్‌ సమీపంలో ఐటీడీఏ మ్యూజియం పక్కనే బసవనంలో ఉన్న భవనంలో తాత్కాలిక క్యాంప్‌ కోర్టును నిర్వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement