నేతాజీ సైనిక్‌ పాఠశాలకు షోకాజ్‌ నోటీసు | - | Sakshi
Sakshi News home page

నేతాజీ సైనిక్‌ పాఠశాలకు షోకాజ్‌ నోటీసు

Nov 17 2026 3:44 AM | Updated on Nov 17 2026 3:44 AM

నేతాజీ సైనిక్‌ పాఠశాలకు షోకాజ్‌ నోటీసు

కేతనకొండ(ఇబ్రహీంపట్నం): కేతనకొండ నేతాజీ సైనిక్‌ పాఠశాలలో విద్యార్థులపై జరిగిన దాడి, వేధింపుల ఘటనపై విద్యాశాఖ స్పందించింది. విద్యార్థులను మోకాళ్లపై నిలబెట్టి, చితకబాదినట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టిన నందిగామ డీవైఈఓ గురునాథం ఇచ్చిన నివేదిక ఆధారంగా జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్‌. చంద్రకళ సోమవారం పాఠశాల యాజమాన్యానికి షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. తమ పిల్లలకు ఏం జరిగిందో తెలుసుకునేందుకు, పాఠశాల యాజమాన్యం నుంచి సమాధానం రాబట్టేందుకు తల్లిదండ్రులు రాత్రంతా పాఠశాల వద్దే పడిగాపులు కాశారు. పిల్లలపై జరిగిన దాడి గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ యాజమాన్యాన్ని నిలదీశారు. తమ పిల్లల భద్రతపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో ఆందోళనకు గురైన ఓ పేరెంట్‌ స్పహ తప్పి పడిపోవడం కలకలం రేపింది. విద్యార్థులను క్రమశిక్షణ పేరుతో శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారంటూ తల్లిదండ్రులు ఆందోళలకు గురయ్యారు. విద్యాసంస్థల్లో విద్యార్థులపై దాడులు, వేధింపుల ఆరోపణలు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఎం.మహేష్‌, నాయకులు విద్యార్థులకు బాసటగా నిలిచారు. షోకాజ్‌ నోటీసుకు పాఠశాల యాజమాన్యం ఇచ్చే వివరణ ఆధారంగా అధికారులు తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంది. విద్యార్థుల భద్రతకు భరోసా కల్పించడంతో పాటు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement