ఆడుతూ.. పాడుతూ.. ఆనందంగా ! | - | Sakshi
Sakshi News home page

ఆడుతూ.. పాడుతూ.. ఆనందంగా !

Nov 16 2026 2:50 AM | Updated on Nov 16 2026 2:50 AM

ఆడుతూ.. పాడుతూ.. ఆనందంగా !

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): నిత్యం వార్తల సేకరణ, సమాజంలోని సమస్యల పరిష్కారం కోసం ఉరుకులు పరుగులు తీసే పాత్రికేయులు ఆదివారం ఒక్క రోజు తమ వృత్తిపరమైన ఒత్తిళ్లకు దూరంగా కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా గడిపారు. ప్రెస్‌క్లబ్‌ అమరావతి ఆధ్వర్యంలో నున్నలోని ఓ రిసార్ట్స్‌లో నిర్వహించిన వనభోజనాలు పసందుగా, ఆహ్లాదకరంగా, సందడిగా సాగాయి. చిన్నారుల కేరింతలు, యువతీ యువకుల ఉత్సాహం, మహిళల సందడి, పెద్దల ఆత్మీయ పలకరింపులతో రిసార్ట్‌ ప్రాంగణమంతా పండుగ వాతావరణాన్ని తలపించింది. ఆదివారం ఉదయం విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ నుంచి ప్రత్యేక బస్సులో బయలుదేరిన పాత్రికేయులు, వారి కుటుంబ సభ్యులు నున్నలోని రిసార్ట్స్‌కు చేరుకున్నారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద అల్పాహార కార్యక్రమం నిర్వహించారు. ప్రెస్‌ క్లబ్‌ అమరావతి ప్రధాన కార్యదర్శి సి.సతీష్‌ బాబు నేతృత్వంలో ఉపాధ్యక్షులు జీవీ నారాయణ, కోశాధికారి వీవీ వరప్రసాద్‌, కార్యవర్గ సభ్యులు కె.సుధాకర్‌ రెడ్డి, ఎంవీ శ్యాంసుందర్‌, ఎ.శ్రీకాంత్‌, బీఎస్‌ఎన్‌. మల్లేశ్వరరావు, వీ శ్రీనివాసరావు, ఐ.ప్రసన్నకుమార్‌, ఎం.మురళీకృష్ణ, ఐ.రామకృష్ణ, ఎస్‌కే అక్బర్‌ పాషా తదితరులు సమన్వయపరిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement