కార్తికేయం నమామ్యహం | - | Sakshi
Sakshi News home page

కార్తికేయం నమామ్యహం

Nov 14 2026 1:35 AM | Updated on Nov 14 2026 1:35 AM

మోపిదేవి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మోపిదేవి శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానం భక్తజనసందోహంతో శుక్రవారం ఆధ్యాత్మికశోభను సంతరించుకుంది. నాగులచవితి సందర్భంగా తెల్లవారుజామున 2.30 గంటలకు ఆలయ డెప్యూటీ కమిషనర్‌ దాసరి శ్రీరామవరప్రసాదరావు వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక జెడ్పీటీసీ మురాల సీతమ్మ, సుబ్బాబరావు దంపతులు, మాజీ జడ్పీటీసీ మెడబలిమి మల్లిఖార్జునరావు దంపతులు, స్థానిక తహసీల్దార్‌ ఎస్‌.భవాని నాగపుట్టలో పాలుపోశారు. అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.

భక్తుల రద్దీ

ఇక్కడ నాగపుట్టలో పాలుపోసేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. గురువారం రాత్రి భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం రద్దీగా మారింది. మధ్యాహ్నం 2 గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగింది. స్థానిక కోస్టల్‌ బ్యాంక్‌ మేనేజర్‌ సీహెచ్‌ హరీష్‌ ఆధ్వర్యంలో 5 వేల మందికి పైగా భక్తులకు వాటర్‌ బాటిళ్లు ఉచితంగా అందచేశారు. అవనిగడ్డ డీఎస్పీ అభిషేక్‌ ఆధ్వర్యంలో పోలీస్‌ బందోబస్తు నిర్వహించారు. సీఐ ఈశ్వరావు, ఎస్‌ఐ గౌతమ్‌కుమార్‌ ఏర్పాట్లను నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement