ప్రైవేట్‌ పనులకు మున్సిపాలిటీ ట్రాక్టర్లు! | - | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ పనులకు మున్సిపాలిటీ ట్రాక్టర్లు!

Nov 14 2026 1:35 AM | Updated on Nov 14 2026 1:35 AM

ప్రైవేట్‌ పనులకు మున్సిపాలిటీ ట్రాక్టర్లు!

ఇబ్రహీంపట్నం: కొండపల్లి మున్సిపాలిటీకి చెందిన ట్రాక్టర్లు ప్రైవేట్‌ పనులకు వాడుతున్నారనే ఆరోపణలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. వార్డుల్లో పారిశుద్ధ్య చెత్తను రవాణా చేయాల్సిన ట్రాక్టర్లను ప్రైవేటు వ్యక్తుల సొంత పనులకు పంపించడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 23వ వార్డులో ఒక ప్రైవేటు వ్యక్తి తన పాత ఇల్లు కూల్చేస్తున్న మెటీరియల్‌ బయటకు తరలించడానికి శుక్రవారం మున్సిపాలిటీ ట్రాక్టర్లను ఉపయోగించడంపై ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక నాయకుడి ఆదేశాల మేరకే ట్రాక్టర్లు పెట్టామని మున్సిపల్‌ సిబ్బంది చెప్పడం గమనార్హం. వార్డుల్లో అపరిశుభ్రత పరిసరాలు, అస్తవ్యస్తంగా ఉన్న ప్రదేశాల్లో మాత్రం అధికారులు కన్నెత్తి చూడరని ప్రజలు మండిపడుతున్నారు. చెత్త తొలగించడానికి ట్రాక్టర్లు రావడం లేదని, కానీ ప్రైవేటు వ్యక్తుల బిల్డింగ్‌ మెటీరియల్‌ తరలించడానికి మాత్రం వెంటనే వస్తున్నాయని విమర్శిస్తున్నారు. వార్డుల్లో ఏ బిల్డింగ్‌ మెటీరియల్‌ తరలింపునకు మున్సిపాలిటీ ట్రాక్టర్లు వాడుకోవచ్చని మున్సిపల్‌ కమిషనర్‌ చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రజల సొమ్ముతో నడిచే ట్రాక్టర్లు సొంత ప్రయోజనాలకు వాడుకోవడం సరికాదని, ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement