సమాజ వికాసానికి యూనియన్‌ బ్యాంక్‌ తోడ్పాటు | - | Sakshi
Sakshi News home page

సమాజ వికాసానికి యూనియన్‌ బ్యాంక్‌ తోడ్పాటు

Nov 12 2026 5:18 AM | Updated on Nov 12 2026 5:18 AM

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): సమాజ వికాసానికి యూనియన్‌ బ్యాంక్‌ అండగా పని చేస్తుందని ఆ బ్యాంక్‌ విజయవాడ జోనల్‌ మేనేజర్‌ కట్టా శ్రీధరబాబు అన్నారు. యూనియన్‌ బ్యాంక్‌ వ్యవస్థాపక దినోత్సవాన్ని నగరంలోని ఒక ఫంక్షన్‌ హాల్లో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రిజర్వు బ్యాంక్‌ రీజినల్‌ డైరెక్టర్‌ బషీర్‌ సందేశాన్ని అందించారు. శ్రీధరబాబు మాట్లాడుతూ విజయవాడ జోనల్‌ పరిధిలో 489 శాఖలు, రాష్ట్రంలో 1,234 శాఖలతో యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బలమైన నెట్‌వర్క్‌ కలిగిన బ్యాంక్‌గా ఉందన్నారు. ప్రజలందరికీ బ్యాంకింగ్‌ సేవలందించటంలో యూనియన్‌ బ్యాంక్‌ చక్కని కృషి కొనసాగిస్తుందన్నారు. అలాగే నాణ్యమైన బ్యాంకింగ్‌ సేవలందించటంలో ముందు భాగంలో ఉందని పేర్కొన్నారు. సుదీర్ఘకాలంగా యూనియన్‌ బ్యాంక్‌ ఖాతా దారుల నమ్మకాన్ని పొందిందన్నారు. రీజనల్‌ మేనేజర్‌ ఎంవీ తిలక్‌ మాట్లాడుతూ బ్యాంక్‌ ప్రస్థానాన్ని వివరిస్తూ సాధించిన విజయాలను సిబ్బందితో పంచుకున్నారు. వివిధ విభాగాల అధిపతులు, బ్యాంక్‌ సిబ్బంది, రిటైర్డ్‌ అధికారులు, ఖాతాదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement