చల్లపల్లి: రైతు బజారులో విక్రయిస్తున్న పెద్ద ఉల్లి పాయలు నల్లగా ఉండి దుర్వాసన వెదజల్లుతున్నాయి. దీంతో వాటిని కొనేందుకు వినియోగదా రులు ముందుకు రావడంలేదు. బహిరంగ మార్కెట్‌లో కిలో ఉల్లి ధర రూ.60 నుంచి రూ.80 వరకూ పలుకుతోంది. ప్రభుత్వం రైతు బజారులో సబ్సిడీపై రూ.35 చొప్పున విక్రయిస్తోంది. సబ్సిడీ పేరుతో నాసిరకంగా, తినేందుకు పనికిరాని ఉల్లిపాయలను విక్రయించటం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి నాణ్యమైన ఉల్లిపాయలు సరఫరా చేయాలని చల్లపల్లి వాసులు కోరుతున్నారు. ఉల్లిపాయల నాణ్యతపై ఎస్టేట్ అధికారి శ్రీనివాసరావును వివరణ కోరగా నాణ్యతా లోపంపై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చామని తెలిపారు.


