తల్లిదండ్రుల చెంతకు తప్పిపోయిన చిన్నారులు | - | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రుల చెంతకు తప్పిపోయిన చిన్నారులు

Nov 12 2026 5:18 AM | Updated on Nov 12 2026 5:18 AM

ఎ.కొండూరు: తల్లిదండ్రులతో కలిసి ఆర్టీసీ బస్సులో వెళుతూ పొరపాటున తప్పిపోయిన ఇద్దరు చిన్నారులను గుర్తించిన ఎ. కొండూరు పోలీసులు వారిని తిరిగి తల్లిదండ్రులకు అప్పగించారు. ఎస్‌ఐ జి.మహాలక్ష్ముడు కథనం మేరకు.. ధర్మవరం నుంచి తల్లిదండ్రులతో కలిసి కనిగిరికి చెందిన ఇరువురు బాలికలు ఈ నెల నాలుగో తేదీన విజయవాడకు రైలులో వచ్చారు. తిరిగి అదే రోజు అర్ధరాత్రి సమయంలో ఆర్టీసీ బస్సులో కనిగిరికి బయలుదేరారు. చిలకలూరిపేట వద్ద టాయిలెట్‌కు వెళ్లేందుకు బాలికలు బస్సు దిగారు. ఆ సమయంలో తల్లిదండ్రులు బస్సులో నిద్రిస్తున్నారు. డ్రైవరు వారిని గమనించలేదు. బాలికలు ఎక్కకుండానే బస్సు వెళ్లిపోయింది. బాలికలు చిలకలూరిపేట నుంచి విజయవాడకు మరో బస్సులో చేరుకున్నారు. అక్కడి నుంచి మరో బస్సులో తిరువూరు వచ్చిన బాలికలు బుధవారం ఉదయం జాతీయ రహదారిపై నడుస్తూ వెళుతుండగా ఎ.కొండూరు మండలం పోలిశెట్టిపాడు వద్ద ఓ ద్విచక్రవాహనదారు ఆగి వారి వివరాలు సేకరించారు. అనంతరం ఎ. కొండూరు పోలీసుస్టేషనులో బాలికలను అప్పగించారు. ఎ.కొండూరు ఎస్‌ఐ మహాలక్ష్ముడు కనిగిరి పోలీసు స్టేషనుకు సమాచారం ఇచ్చి బాలికల తల్లిదండ్రుల వివరాలు సేకరించారు. అనంతరం తప్పిపోయిన బాలికలను వారి తల్లిదండ్రులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement