పుణ్య స్నానాలు, అభిషేకాలు | - | Sakshi
Sakshi News home page

పుణ్య స్నానాలు, అభిషేకాలు

Nov 11 2026 3:45 AM | Updated on Nov 11 2026 3:45 AM

పుణ్య స్నానాలు, అభిషేకాలు

నాగాయలంక: కార్తిక మాసోత్సవాల్లో తొలి రోజు మంగళవారం నాగాయలంక శ్రీరామ పాదక్షేత్రం ఘాట్‌ వద్ద కృష్ణానదిలో భక్తులు తెల్లవారుజాము 4గంటల నుంచే పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతర కృష్ణానది జలాలతో ఘాట్‌లోని శ్రీరామలింగేశ్వరస్వామి మండపంలో శివలింగానికి భక్తజనం భక్తిశ్రద్ధలతో స్వీయ అభిషేకాలు చేసుకుని ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. నాగాయలంకలో కృష్ణానదిలో కార్తిక స్నానాలకు వచ్చే భక్తులకు శ్రీరామలింగేశ్వర శివలింగం ప్రత్యేక ఆధ్యాత్మిక ఆకర్షణగా నిలిచింది. పోలీసులు, పంచాయతీ అధికారులు హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేశారు. స్నానాల అనంతరం భక్తులు నది ఒడ్డున ప్రమిదల్లో కార్తిక దీపాలు వెలిగించుకొని క్షేత్రం ప్రాంగణంలోని శ్రీభూనీలావెంకటేశ్వరస్వామి ఆలయం, శ్రీకనకదుర్గమ్మ, రమాసహిత సత్యనారాయణ స్వామి, శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకున్నారు. మహిళా భక్తులు దుస్తులు మార్చుకోవడానికి పంచాయితీ ఆధ్వర్యంలో తాత్కాలిక గదులు ఏర్పాటు చేశారు. కమిటీ చైర్మన్‌ ఆలూరి శ్రీనివాసరావు, తలశిల రఘుశేఖర్‌, ఉప్పల బుజ్జి పర్యవేక్షించారు. శ్రీనగరేశ్వరస్వామికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలు నాగాయలంక ఆర్యవైశ్యసంఘాల ఆధ్వర్యంలో స్థానిక శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి సమన్విత శ్రీపార్వతిదేవి సమేత శ్రీనగరేశ్వరస్వామి ఆలయంలో 34వ వార్షిక కార్తిక మహోత్సవాలు మంగళవారం శాస్త్రోక్తంగా ప్రారంభించారు. స్వామికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలు జరిపారు. ఆలయ కమిటీ చైర్మన్‌ చిట్టా సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

శ్రీరామపాద క్షేత్రంలో కార్తిక మాస పూజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement