యువకుడిపై గుర్తుతెలియని వ్యక్తుల దాడి | - | Sakshi
Sakshi News home page

యువకుడిపై గుర్తుతెలియని వ్యక్తుల దాడి

Nov 11 2026 3:45 AM | Updated on Nov 11 2026 3:45 AM

ఇబ్రహీంపట్నం: అర్ధరాత్రి వేళ యువకుడిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటన ఇబ్రహీంపట్నం ఫెర్రీలో కలకలం రేపింది. పట్టణంలోని ఓ అపార్ట్‌మెంట్‌ వద్ద సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి అయిన తన యజమానిని లక్ష్యంగా చేసుకుని వచ్చిన కొందరు వ్యక్తులు ఆయన వద్ద కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న యువకుడిపై విచక్షణా రహితంగా దాడికి దిగారు. వీరిలో కొందరు కారు డ్రైవర్‌కు గతంలో పాత కక్షలు ఉన్నవారు కూడా ఉన్నారు.

సేకరించిన వివరాలు ఇవి..

మండలంలోని ఈలప్రోలు గ్రామానికి చెందిన మిర్యాల తంబి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి శ్రావణ్‌ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తెల్లవారు జామున హైదరాబాద్‌ వెళ్లేందుకు ఫెర్రీలోని ఓ అపార్ట్‌మెంట్‌కు రాత్రి 9గంటలకు చేరుకుని అక్కడే తంబి నిద్రపోయాడు. అర్ధరాత్రి వేళ గుర్తుతెలియని వ్యక్తులు అపార్ట్‌మెంట్‌లోకి చొరబడి తంబిపై తీవ్రంగా దాడిచేశారు. మీ యజమాని ఎక్కడ ఉన్నాడో చెప్పమని చితకబాదారు. గదిలో ఉన్న ఫర్నీచర్‌, టీవీ తదితర వస్తువులు ధ్వంసం చేశారు. తీవ్రమైన రక్తం గాయాలతో ఉన్న తంబిని కారులో ఎక్కించుకుని కొండపల్లి డీఏవీ పాఠశాల, శాంతినగర్‌ తదితర ప్రాంతాల్లో తిప్పుతూ చితక బాదారు. మీ యజమాని శ్రావణ్‌ ఎక్కడున్నాడో మాకు సమాచారం ఇవ్వాలని అందుకే నిన్ను వదిలేస్తున్నామని బెదిరించి వదిలేశారు.

వాచ్‌మెన్‌ ఫోన్‌ ద్వారా..

అపార్ట్‌మెంటు వాచ్‌మెన్‌ 100కు డైల్‌ చేసి జరిగిన దాడి విషయం చెప్పడంతో పోలీసులు జీపీఎస్‌ ట్రాక్‌ ద్వారా డీఏవీ స్కూల్‌ సమీపంలో పడి ఉన్న తంబిని గుర్తించి వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం అతను ప్రైవేట్‌ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. రియల్‌ ఎస్టేట్‌లో భాగస్వాముల మధ్య వివాదమా, లేక రాజకీయ కక్ష సాధింపులో భాగంగా దాడి జరిగిందా అనేది పోలీసుల విచారణలో తేల్చాల్సి ఉంది. బాధితుడు తంబి ఫిర్యాదు మేరకు గొల్లపూడికి చెందిన నూతలపాటి సాయి, చిట్టినేని సాయి, మరో నలుగురుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

రియల్‌ ఎస్టేట్‌ యజమాని కోసం వచ్చి డ్రైవర్‌ను చితకబాదిన వైనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement