కె.కొత్తపాలెం(మోపిదేవి): మండల పరిధిలోని కె.కొత్తపాలెం గ్రామంలో ఆదివారం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పొలిమెట్ల వెంకటేశ్వరావు కుమారుడు రుద్రవర్మ(చందు)(23) ఇంటి వద్ద మోటారుకు విద్యుత్ కనెక్షన్ ఇస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు అవనిగడ్డ ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పండగ వేళ యువకుడు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్‌ఐ గౌతమ్‌కుమార్ వెల్లడించారు.


