కృష్ణాజిల్లా | - | Sakshi
Sakshi News home page

కృష్ణాజిల్లా

Oct 30 2026 7:36 AM | Updated on Oct 30 2026 7:36 AM

శుక్రవారం శ్రీ 30 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026 రేపటి వరకు సరస్‌ మేళా విజిలెన్స్‌ తనిఖీలు ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

న్యూస్‌రీల్‌

పోటీ నుంచి తప్పుకోవాలని వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులకు హెచ్చరికలు పోలీసుల ఎదుటే పీక కోస్తానంటూ బెదిరించిన టీడీపీ అభ్యర్థి భర్త ఫ్లెక్సీలు కోసేసి, వాల్‌ స్టిక్కర్లు తొలగించి టీడీపీ కవ్వింపు చర్యలు ప్రచారానికి వెళ్తే అరెస్టు చేస్తానంటూ వైఎస్సార్‌ సీపీ శ్రేణులకు సీఐ బెదిరింపు

విజయవాడలో రెచ్చిపోయిన రౌడీమూక

శుక్రవారం శ్రీ 30 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

7

భవానీపురం: విజయవాడ భవానీపురంలో నిర్వహిస్తున్న జాతీయ సరస్‌ మేళాను గురువారం ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ జి.లక్ష్మీశ సందర్శించారు. ఈ నెల 31తో మేళా ముగియనుందన్నారు.

గుడివాడరూరల్‌: గుడివాడ మార్కెట్‌ యార్డ్‌లోని ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు గురువారం రాత్రి తనిఖీ చేశారు. బియ్యం మాయమైనట్టు వారికి ఫిర్యాదు అందింది.

ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ

ఇబ్రహీంపట్నం: మునిసిపల్‌ ఎన్నికల విధుల్లో సంబంధిత అధికారులు అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. మునిసిపల్‌ ఎన్నికల నిర్వహణలో భాగంగా కొండపల్లి మునిసిపాలిటీ పరిధిలోని కీలక పోలింగ్‌ కేంద్రాలను ఆయన గురువారం క్షేత్రస్థాయిలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఏర్పాట్లు సజావుగా జరుగుతున్నాయా లేదా అని స్వయంగా పరిశీలించారు. సంబంధిత అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ముందుగా మునిసిపల్‌ కార్యాలయాన్ని సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన బ్యాలెట్‌ పంపిణీ కేంద్రం, బ్యాలెట్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని, బ్యాలెట్‌ పత్రాల భద్రత విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అనంతరం జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రం, స్ట్రాంగ్‌ రూమ్‌లను కలెక్టర్‌ పరిశీలించారు. స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద పటిష్ట బందోబస్తు, సీసీ కెమెరాల నిఘా ఏర్పాట్లు, నిరంతర విద్యుత్‌ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. డీఏవీ పబ్లిక్‌ స్కూల్‌లోని పోలింగ్‌ కేంద్రాలను సందర్శించి ఓటర్లకు ఏర్పాటు చేసిన తాగునీరు, విద్యుత్‌, షామియానాలు, ర్యాంపులను పరిశీలించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్‌ కేంద్రానికి వంద మీటర్ల దూరంలో తప్పనిసరిగా మార్కింగ్‌ చేయాలన్నారు. శుక్రవారం లోపుగా ఎన్నికలకు సంబంధించి పాలనాపరమైన, సాంకేతిక ఏర్పాట్లను నూరు శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. మునిసిపల్‌ కమిషనర్‌ బి.శ్రీనివాసు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

సాక్షి ప్రతినిధి, విజయవాడ: స్థానిక ఎన్నికల ప్రచారం ముగియడానికి ఇంకా కొద్ది గంటల సమయం మాత్రమే ఉండటంతో కూటమి నాయకులు దౌర్జన్య కాండకు తెరతీశారు. పోలీసులను అడ్డం పెట్టుకుని వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలను బెదిరించే ప్రయత్నాలు చేపట్టారు. పోటీ నుంచి తప్పుకోవాలని, ప్రచారానికి వెళ్లొద్దని హుకుం జారీ చేస్తున్నారు. కొన్ని చోట్ల పోలీసులను అడ్డం పెట్టుకుని బెదిరింపులకు దిగుతున్నారు. మరి కొన్ని చోట్ల పోలీసుల సమక్షంలోనే ఏకంగా వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులపై దాడులకు తెగబడుతున్నారు. భవానీపురంలో ప్రచారానికి వెళ్తే అరెస్టు, బైండోవర్‌ చేస్తానంటూ వైఎస్సార్‌ సీపీ శ్రేణులను సీఐ సైతం బెదిరించారు.

అర్ధరాత్రి 12 గంటలకు..

బుధవారం అర్ధరాత్రి 12 గంటలకు తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట సెగ్మెంట్‌–1 వైఎస్సార్‌ సీపీ ఎంపీటీసీ అభ్యర్థి చెరుకు సుజాత ఇంటి తలుపులను బాదుతూ బెదిరింపులకు దిగారు. ముగ్గురు వ్యక్తులు ఆమె ఇంటి వద్ద హంగామా సృష్టించారు. వారి ఆగడాలు తాళలేక సుజాత కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చే సరికి ఇద్దరు పరారవగా, బాత్‌రూంలో దాక్కున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సుజాత నామినేషన్‌ వేసినప్పటి నుంచి ప్రత్యర్థులు బెదిరిస్తూనే ఉన్నారు. పోటీ నుంచి తప్పుకోవాలని లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు తప్పవంటూ భయపెడుతున్నారు. దీంతో వైఎస్సార్‌ సీపీ నాయకులు పెద్ద ఎత్తున విస్సన్నపేట పోలీసు స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలంటూ డిమాండ్‌ చేశారు.

అరెస్టు చేస్తానంటూ సీఐ హెచ్చరికలు

భవానీపురంలో పోలీసులను అడ్డం పెట్టుకుని వైఎస్సార్‌ సీపీ నేతలను భయపెట్టేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నాలు చేశారు. విజయవాడలోని 37వ డివిజన్‌కు చెందిన వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు పెద్ది సత్యసాయిబాబు, వల్లం రవికుమార్‌, అంకాని నాగ రాజు, షేక్‌ రియాజ్‌, సాలి వేణును భవానీపురం సీఐ ఉమామహేశ్వరరావు పోలీస్‌ స్టేషన్‌కు పిలి పించి వారిని గంటల తరబడి స్టేషన్‌లో ఉంచారు. వైఎస్సార్‌ సీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనొద్దని హెచ్చరించారు. తన మాట ధిక్కరించి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే అరెస్టు చేయడంతోపాటు, బైండోవర్‌ కేసుల నమోదు కోసం పశ్చిమ మండల తహసీల్దార్‌ వద్దకు పంపిస్తానని సీఐ బెదిరించారు. వారి ఆధార్‌ కార్డుల జిరాక్స్‌ కాపీలు తీసుకుని, వాటిపై సంతకాలు చేయించేందుకు ప్రయ త్నించారు. దీంతో మేయర్‌ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మి తరపున చీఫ్‌ ఎలెక్షన్‌ ఏజెంట్‌గా ఉన్న గుండె సుందర్‌పాల్‌ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి సీఐ ఉమామహేశ్వరరావుపై ఫిర్యాదుచేశారు. కార్యకర్తలను పోలీస్‌ స్టేషన్‌లో ఉంచిన వ్యవహారాన్ని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లారు. వెలంపల్లి స్పందించి ఈ ఘటనపై పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌.వి.రాజశేఖరబాబుతో మాట్లాడిన తర్వాత కార్యకర్తలను విడుదల చేశారు.

వైఎస్సార్‌ సీపీకి పట్టం..

అభివృద్ధికి శ్రీకారం

విజయవాడ 43వ డివిజన్‌లో వైఎస్సార్‌ సీపీ అభ్య ర్థిపై తెలుగు తమ్ముళ్లు బెదిరింపులు, దాడులకు దిగారు. ప్రచారంలో పాల్గొన్న మహిళలపై టీడీపీ కార్యకర్తలు బెదిరింపులకు పాల్పడ్డారు. ఆటోలో ప్రచారానికి తీసుకువెళ్లిన పెన్‌ డ్రైవ్‌లను లాక్కున్నారు. పార్టీ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను బ్లేడులతో కోసేయడమే కాకుండా డివిజన్‌లో వైఎస్సార్‌ సీపీ నాయకులు అతికించిన వాల్‌ స్టిక్కర్లను తొలగించి టీడీపీ స్టిక్కర్లు అంటించి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు. ఈ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి గుర్రం కనకదుర్గ భర్త కొండ, మరి కొంతమంది అనుచరులు ఇలా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. బుధవారం రాత్రి వైఎస్సార్‌ సీపీ తరఫున ప్రచారం నిర్వహిస్తున్న మహిళలను నాలుగు బైక్‌లపై వచ్చిన గుర్రం కొండ మనుషులు బెదిరింపులకు పాల్పడ్డారు. రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్న నేతలపై రెచ్చిపోయారు. తెలుగుదేశం గెలిచిన తర్వాత నార తీస్తాం, కత్తులతో పొడుస్తాం, మీ పీకలు కోస్తాం అంటూ టీడీపీ నాయకుడు గుర్రం కొండ దౌర్జన్యానికి దిగాడు.

పీక కోస్తానంటూ వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలను బెదిరిస్తున్న టీడీపీ నాయకుడు గుర్రం కొండ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement