uIIలో దుర్గాభవానీ పెద్ద ఎత్తున తరలివస్తున్న భవానీలు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఆదివారం అమ్మవారు శ్రీదుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున అమ్మవారికి సుప్రభాత సేవ, విశేష అలంకరణ, పూజా కార్యక్రమాల అనంతరం 3.45 గంటలకు దర్శనాలు ప్రారంభమయ్యాయి. ప్రత్యేక ఖడ్గమాలార్చన, ప్రత్యేక కుంకుమార్చన, ప్రత్యేక శత చండీహోమం, ప్రత్యేక శ్రీచక్రనవార్చనలో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. సీతమ్మ వారి పాదాలు, వీఎంసీ కార్యాలయంతో పాటు హోల్‌సేల్ పూలమార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన కంపార్టుమెంట్లు మొత్తం భక్తులతో కళకళలాడుతూ కనిపించాయి. వీఎంసీ కార్యాలయం వైపు నుంచి క్యూలైన్‌లోకి ప్రవేశించే భక్తులకు అమ్మవారి దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుండగా.. భవానీపురం, హెడ్ వాటర్ వర్క్స్ వైపు ఏర్పాటు చేసిన క్యూలైన్ల ద్వారా కొండపైకి చేరుకున్న వారికి రెండున్నర గంటల్లో అమ్మవారి దర్శనం పూర్తవుతోంది.
దసరా ఉత్సవాలలో 8 రోజులకు మొత్తం 17 లక్షల లడ్డూలను విక్రయించినట్లు ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. ఆదివారం భక్తుల రద్దీ అఽధికంగా ఉండటంతో సుమారు రెండు లక్షల లడ్డూలను విక్రయించామన్నారు. ఉత్సవాలలో కీలకమైన 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు 5 రోజుల పాటు భవానీల రద్దీ అధికంగా ఉండటంతో పాటు లడ్డూ విక్రయాలు భారీగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఇందు కోసం మరో 30 లక్షల లడ్డూల తయారికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రసాదం విక్రయం కోసం మొత్తం 19 కౌంటర్లు అందుబాటులో ఉంచారు.
దసరా మహోత్సవాలలో భాగంగా 8వ రోజు ఆదివారం దేవస్థానానికి రూ.35.15లక్షల మేర ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. లడ్డూ ప్రసాదాలు విక్రయం ద్వారానే రూ. 33.50 లక్షల మేర ఆదాయం సమకూరిందని, కేశకండన శాల ద్వారా రూ. 1.44లక్షలు, పుస్తకాలు, అమ్మవారి ఫొటోల ద్వారా రూ. 10వేల ఆదాయం లభించిందన్నారు. కాగా మహోత్సవాలలో భాగంగా 9వ రోజు సోమవారం దుర్గమ్మ శ్రీమహిషాసురమర్ధినీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ అలంకారంలో దర్శించడం వల్ల ధైర్యం, స్థైర్యం, విజయాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు.
రమణీయం.. నగరోత్సవం
uIIలో
జయహో
పెద్ద ఎత్తున తరలివస్తున్న భవానీలు
పెరిగిన భవానీల తాకిడి..
జై భవానీ.. జైజై భవానీ నామస్మరణతో అమ్మవారి ఆలయ ప్రాంగణం మార్మోగుతోంది. భవానీ దీక్షపరులు అమ్మవారిని దర్శించుకుని ఇరుముడు లను సమర్పిస్తున్నారు. మహా మండపం దిగువన ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల వద్ద గురు భవానీలకు ఇరుముడులను సమర్పించి దీక్షను పరిపూర్ణం చేసుకుంటున్నారు. తూర్పు గోదావరి, అనకాపల్లి, విశాఖపట్నం వైపు నుంచి పాదయాత్రగా ఇంద్రకీలాద్రికి చేరుకుంటున్న భవానీలను దేవస్థానం బస్సుల్లో కొండపైకి చేర్చుతున్నారు. ఓం టర్నింగ్ నుంచి ఆలయానికి చేరుకుంటున్న భవానీలు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. అమ్మవారి సన్నిధికి చేరుకుంటున్న భవానీలకు సేవా సిబ్బంది వేడివేడి పాలు, బిస్కెట్లు అందజేస్తున్నారు.
17 లక్షల లడ్డూల విక్రయం..
8వ రోజు ఆదాయం
రూ. 35.15లక్షలు
దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల నగరోత్సవ సేవ ఆదివారం కనుల పండువగా జరిగింది. తొలుత మల్లేశ్వర స్వామి వారి ఆలయం సమీపంలోని యాగశాల నుంచి ఆదిదంపతులకు ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ అధికారులు కొబ్బరికాయలను కొట్టి ఊరేగింపును ప్రారంభించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాట నృత్యాలు, డప్పు కళాకారుల విన్యాసాల మధ్య ఊరేగింపు అంగరంగ వైభవంగా సాగింది. ఆలయానికి చేరుకున్న అనంతరం రాజగోపురం ఎదుట ఆస్థాన సేవను నిర్వహించారు. వేద పండితులు, అర్చకులు విశేష చతుర్వేద హారతులను సమర్పించారు.