కోనేరుసెంటర్: గాంధీజీ ఆశయాలు, విలువలు అందరికీ ఆదర్శప్రాయమని జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్‌నాయుడు పేర్కొన్నారు. మహనీయుల జీవితాలు, వారి నైతిక విలువలను సిబ్బంది మార్గదర్శకంగా తీసుకోవాలని సూచించారు. జాతిపిత మహాత్మగాంధీ జయంతి వేడుకలను శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొని మహాత్మగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎస్పీ మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన మహాత్మగాంధీ సూక్తులు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన చూపిన శాంతి మార్గాన్ని అందరూ అనుసరించాలన్నారు. అలాగే భారత రెండో ప్రధాని లాల్‌బహదూర్‌శాస్త్రి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


