జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేక చట్టం చేయాలి | - | Sakshi
Sakshi News home page

జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేక చట్టం చేయాలి

Oct 3 2026 1:44 AM | Updated on Oct 3 2026 1:44 AM

మధురానగర్‌(విజయవాడసెంట్రల్‌): వర్కింగ్‌ జర్నలిస్టుల భద్రత కోసం ఒక ప్రత్యేక చట్టం చేయాలని.. వర్కింగ్‌ జర్నలిస్ట్‌ చట్టాన్ని పునరుద్ధరించాలని ఇండియన్‌ జర్నలిస్ట్స్‌ యూనియన్‌ సెక్రటరీ జనరల్‌ డి.సోమసుందర్‌ డిమాండ్‌ చేశారు. గాంధీ జయంతి రోజున దేశవ్యాప్తంగా కోర్కెల దినం పాటించాలన్న ఐజేయూ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్‌ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడలో మోటార్‌ సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. కొత్త వంతెన సెంటర్లోని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జర్నలిస్టుల కోర్కెలు పరిష్కారం చేయాలని కోరుతూ వివిధ డిమాండ్లపై నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సోమసుందర్‌ మాట్లాడుతూ దేశంలో మీడియా స్థితిగతులపై అధ్యయనం చేయడం కోసం మీడియా కమిషన్‌ నియమించాలని, జర్నలిస్టుల, మీడియా సంస్థల భద్రత కోసం ప్రత్యేక చట్టం చేయాలని డిమాండ్‌ చేశారు. జర్నలిస్టుల వేతన సవరణ కోసం వేజ్‌ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వి.సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇచ్చి గృహనిర్మాణం చేపడతామని ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీపై కదలిక లేదన్నారు. దేశంలో 15 రాష్ట్రాల్లో రిటైరైన జర్నలిస్టులకు పింఛను ఇస్తున్నారని, ఇక్కడ కూడా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఏపీయుడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి కంచల జయరాజ్‌, విజయవాడ యూనిట్‌ అధ్యక్ష, కార్యదర్శులు చావా రవి, దారం వెంకటేశ్వరరావు, ఐజేయూ కార్యవర్గ సభ్యులు కూన అజయ్‌ బాబు, ఏపీ ఎలక్ట్రానిక్‌ మీడియా జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఏచూరి శివ, సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.హెచ్‌. రమణారెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ ఫొటో జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు సి.హెచ్‌. విజయ భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఐజేయూ సెక్రటరీ జనరల్‌

డి.సోమసుందర్‌ డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement