గల్లంతయిన యువకుడి మృతదేహం లభ్యం | - | Sakshi
Sakshi News home page

గల్లంతయిన యువకుడి మృతదేహం లభ్యం

Oct 3 2026 1:44 AM | Updated on Oct 3 2026 1:44 AM

గల్లంతయిన యువకుడి మృతదేహం లభ్యం

పెడన: మండల పరిధిలోని కూడూరు గ్రామం వద్ద గురువారం సాయంత్రం లజ్జబండ డ్రయిన్‌లో ప్రమాదవశాత్తు పడి గల్లంతైన యువకుడు శుక్రవారం మధ్యాహ్నం శవమై తేలాడు. పెడన పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కూడూరు పంచాయతీ కొత్తూరు హరిజనవాడకు చెందిన వ్యవసాయ కూలి బళ్ల మధుసూదనరావు(34) గురువారం సాయంత్రం లజ్జబండ వద్ద కాళ్లు చేతులు శుభ్రం చేసుకోవడానికి దిగాడు. ప్రమాదవశాత్తు పడిపోవడంతో నీటి ఉధృతికి కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. విషయం తెలిసిన పెడన సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.నాగేంద్రప్రసాద్‌, ఎస్‌ఐ సత్యనారాయణలు పర్యవేక్షణలో స్టేషన్‌ సిబ్బంది గ్రామస్థులతో కలిసి గాలింపు చేపట్టారు. గురువారం రాత్రి ఆర్ధరాత్రి కావడంతో తిరిగి శుక్రవారం వేకువ జామునే గాలింపు చేపట్టారు. డ్రోన్‌ కెమెరాలు వినియోగించారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి 300 మీటర్లు దూరంలో శుక్రవారం మధ్యాహ్నం అదే డ్రయిన్‌లో మధుసూదనరావు మృతదేహం కనిపించింది. గట్టుకు చేర్చిన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. యువకుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement