పింఛను ఆశ.. అడియాస! | - | Sakshi
Sakshi News home page

పింఛను ఆశ.. అడియాస!

Oct 3 2026 1:44 AM | Updated on Oct 3 2026 1:44 AM

పింఛను ఆశ.. అడియాస!

మభ్య పెట్టేందుకే కొత్త నాటకం..

మరోసారి మోసం చేస్తున్నారు

● గత నెలలో దరఖాస్తు చేసిన పెన్షన్‌

దరఖాస్తుదారులకు మొండిచేయి

● ఈ నెలే కొత్త పెన్షన్‌లిస్తామంటూ

ఊదరగొట్టిన కూటమి నేతలు

● కొత్త పెన్షన్‌ వస్తుందని ఆశగా ఎదురు చూసిన వృద్ధులు, వికలాంగులు

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త పింఛన్లు ఇచ్చిన దాఖలాలు లేవు. ఒకటో తేదీన తమకు కొత్తగా పింఛను సొమ్ము వస్తుందని ఎదురు చూసిన అవ్వాతాత్తల ఆశలు అడియాసలయ్యాయి. ఎన్నికల సమయంలో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అర్హులందరికీ పింఛన్లిస్తామని ఊదరగొట్టిన చంద్రబాబు ప్రభుత్వం ఆ ఊసే ఎత్తటం లేదు. వైఎస్సార్‌ సీపీతో పాటుగా ప్రతిపక్షాలు చేపట్టిన ఆందోళనలతో గత నెలలో కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవటానికి కూటమి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ నెల నుంచి పెన్షన్‌లు వచ్చేస్తాయంటూ కూటమి నేతలు ఊదరగొట్టారు. కానీ ఒకటో తేదీన కొత్త వాటి ఊసు లేకపోవటంతో వారంతా ఊసూరుమంటున్నారు.

ఉమ్మడి జిల్లాలో 1,10,903 మంది దరఖాస్తు..

కూటమి ప్రభుత్వం గత మాసంలో ఆన్‌లైన్‌ ద్వారా కొత్త పెన్షన్‌ల కోసం పోర్ట్‌ల్‌ను ఓపెన్‌ చేసింది. ఆ క్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా 1,10,903 మంది వివిధ పెన్షన్‌ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో కృష్ణా జిల్లాకు 52,181 మంది, ఎన్టీఆర్‌ జిల్లాకు 58722 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్క విజయవాడ నగరంలోనే సుమారు 18 వేల మంది, మచిలీపట్నంలో తొమ్మిది వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నట్లుగా నివేదికలు చెబుతున్నాయి. వారంతా అక్టోబర్‌ నెల నుంచి కొత్తగా పెన్షన్‌ తీసుకోవచ్చనే ఆశతో ఎదురు చూశారు. ఉమ్మడి జిల్లాలో వృద్ధులు 24 వేల మంది, వితంతు పెన్షన్‌ల కోసం 14 వేల దరఖాస్తు చేసుకున్నారు. దివ్యాంగులు, చేనేత కార్మికులు, డప్పు కళాకారులు, గీత కార్మికులు, చర్మకారులు తదితర వర్గాలకు చెందిన వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో ప్రజలను మభ్య పెట్టడానికి కొత్త పింఛన్ల పేరుతో కూటమి ప్రభుత్వం హడావుడి చేసినట్లు భావిస్తున్నారు. పెన్షన్‌ ఇచ్చే ఉద్దేశం ఉంటే ఆన్‌లైన్‌ ద్వారా ఎంపిక వెంటనే జరుగుతుందని, రోజుల తరబడి చేసే అవకాశం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. దీనిని సూపర్‌ సిక్స్‌లో కలిపేస్తారంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు ఎప్పటి నుంచో పెన్షన్‌లు తీసుకుంటున్న పెన్షన్‌దారులు సైతం చంద్రబాబు అధికారం చేపట్టన నాటి నుంచి తమ పెన్షన్ల విషయంలో అనేక భయాందోళనలతో గడుపుతున్నారు. చంద్రబాబు పాలనలో పాతవి తీసివేసి కొత్తవారికి ఇచ్చిన దాఖలాలు ఉన్నాయనే ప్రచారం వారి ఆందోళనకు కారణమవుతోంది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులనవారందరికీ పెన్షన్‌లిస్తామంటూ మభ్య పెట్టారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ల తరువాత దరఖాస్తు చేసుకోమని, వచ్చే మొదటి తేదీన పెన్షన్‌లిస్తామంటూ కూటమి నేతలు ఊదరగొట్టారు. కానీ అక్టోబర్‌ మొదటి తేదీన ఎంతో ఆశతో ఎదురు చూసిన వృద్దులకు, వికలాంగులకు, వితంతువులకు చంద్రబాబు ప్రభుత్వం మరోసారి మొండిచెయ్యి చూపించింది. ఇప్పటికై నా ప్రభుత్వం పెన్షన్‌లు మంజూరు చేయాలి.

– కామరాజ్‌ హరీష్‌కుమార్‌,

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధికార ప్రతినిధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement