స్వచ్ఛత ప్రజల జీవన విధానంగా మారాలి | - | Sakshi
Sakshi News home page

స్వచ్ఛత ప్రజల జీవన విధానంగా మారాలి

Oct 3 2026 1:44 AM | Updated on Oct 3 2026 1:44 AM

● గాంధీజీ జీవితం సేవా భావానికి

నిదర్శనం

● స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రదానోత్సవంలో

కలెక్టర్‌ బాలాజీ

చిలకలపూడి(మచిలీపట్నం): స్వచ్ఛతను కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజల జీవన విధానంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని కలెక్టర్‌ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా పరిషత్‌ సమావేశపు హాలులో కృష్ణా జిల్లా స్వచ్ఛాంధ్ర అవార్డు – 2026 ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా స్థాయిలో ఎంపికై న అవార్డు గ్రహీతలకు అవార్డులు అందజేసి ఘనంగా సత్కరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ మహాత్మాగాంధీ చూపిన మార్గంలో నడుస్తూ పరిశుభ్రత, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఆయన జీవితం ఒక పరిపూర్ణ మానవుడు ఎలా ఉండాలో చూపించే నిలువెత్తు నిదర్శనమన్నారు. స్వచ్ఛత పట్ల నిబద్ధతను గాంధీజీని చూసి ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. జిల్లాలో పరిశుభ్రత, పారిశుధ్య పరిరక్షణకు కృషి చేసిన వ్యక్తులు, సంస్థలు, స్థానిక సంస్థల గుర్తించి అవార్డులతో సత్కరించటం ద్వారా మరింత మంది స్పూర్తి పొందుతారన్నారు. కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ డైరెక్టర్‌ బోలెం నాగమణి, జెడ్పీ డెప్యూటీ సీఈవో ఆర్‌సీ ఆనంద్‌కుమార్‌, మునిసిపల్‌ కమిషనర్‌ బాపిరాజు, పర్యాటకశాఖాధికారి రామలక్ష్మణరావు, డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ దయాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement