ఎన్నికల వేళ.. పట్టాల ఎర! | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల వేళ.. పట్టాల ఎర!

Sep 30 2026 1:40 AM | Updated on Sep 30 2026 1:40 AM

పాత పట్టాలతో కొత్త ‘పండుగ’ అందుకేనా? ● మునిసిపల్‌ ఎన్నికల ప్రచారాస్త్రంగా వాడుకునే ఎత్తుగడ ● పేదలకు ఆశపెట్టి.. మభ్యపెడుతున్న సర్కారు ● కొత్తగా కూటమి ఇస్తున్న పట్టాల్లో 90 శాతం పాతవే ● అంతా తామే ఇస్తున్నట్లు ఆర్భాటం ● కరకట్టవాసులకు మొండిచెయ్యి

ఇదీ పరిస్థితి

పట్టా మీదే.. షరతులు వర్తిస్తాయ్‌!

పాత పట్టాలతో కొత్త ‘పండుగ’ అందుకేనా?

సాక్షి ప్రతినిధి, విజయవాడ: మునిసిపల్‌ ఎన్నికల వేళ విజయవాడ నగర ప్రజలను మభ్యపెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేదలకు పట్టాభిషేకం పేరుతో పట్టాల పంపిణీ అంటూ హడావుడి మొదలు పెట్టారు. అందుకోసం సింగ్‌నగర్‌ మాకి నేని బసవపున్నయ్య స్టేడియంలో కార్యక్రమం ఏర్పా టు చేశారు. దీని కోసం ప్రజాప్రతినిధులు ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు. వాస్తవానికి ఇందులో ప్రచార ఆర్భాటం తప్ప ప్రజలకు ఒరిగిందేమి లేదు. కొత్తగా 24,042 పట్టాలు ఇస్తామని ప్రకటించగా అందులో గతంలో పంపిణీ చేసిన పట్టాలు 21,456 ఉండగా, కొత్తగా ఇస్తున్నవి 2,586 మాత్రమే ఉన్నాయి.

పచ్చి మోసం..

ఎన్టీఆర్‌ జిల్లాలో, విజయవాడలో లక్ష మందికి పైగా పేదలకు ఇళ్లు లేవు. అద్దె ఇళ్లల్లో కాపురం ఉంటున్నారు. వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా కేవలం పేదలకు పట్టాభిషేకం అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. గతంలో విజయవాడ నగరంలో సుమారు 30వేల మంది వరకూ రాజధానిలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లేఅవుట్లు వేసి స్థలాలు కేటాయించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిని రద్దు చేసింది. మళ్లీ వారికి సొంత ప్రాంతాల్లోనే పట్టాలు ఇస్తామని ప్రచారం చేసుకున్నా ఒక్కరికి కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వలేదు. గత రెండున్నర సంవత్సరాల కాలంలో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా రెండు, మూడు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. గతంలో వివిధ ప్రభుత్వాలు ఇచ్చిన 12,710 మందికి మళ్లీ నేడు తాజాగా పట్టాలిస్తున్నట్లు ప్రకటించారు. గతంలో పట్టాలిచ్చిన 8,746 మందిలో కొందరు చనిపోతే వారి వారసులకు పట్టాలో పేరు మార్చి, కొంతమంది కొనుక్కున్న వారి పేర్లు నేడు మార్చి, ప్రస్తుత లబ్ధిదారులకు కొత్తగా పట్టాలిస్తున్నట్లు ప్రకటిస్తున్నారు.

మరి వీరి సంగతేంటి?

అదే సమయంలో అభ్యంతరకర ఆక్రమణల పేరుతో నగరంలోనూ, జిల్లాలోనూ, కృష్ణానది కరకట్టపైన, ఏలూరు, రైవస్‌, బందర్‌ కాల్వ గట్లు, బుడమేరు గట్టు, రైల్వే శాఖ భూములు, చెరువు భూములు ఇతర ఇరిగేషన్‌, దేవదాయ శాఖ భూముల్లో దశాబ్దాల నుంచి నివసిస్తున్న వారికి పట్టాలు ఇవ్వలేదు. ఇరిగేషన్‌ స్థలాల్లో స్టార్‌ హోటళ్లకు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం పేదలకు మాత్రం ఇవ్వకపోవడం దారుణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాల్వగట్లపై ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఉన్నప్పుడు పేదల ఇళ్లు ఉంటే అభ్యంతరం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే కృష్ణలంకలోని కళానగర్‌, భూపేష్‌ గుప్తా నగర్‌, తారకరామ నగర్‌ ప్రాంత వాసులు తమకు కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటూ సీపీఎం నేతృత్వంలో గీతానగర్‌ కరకట్ట వద్ద నిరసనకు దిగారు. కరకట్టకు పక్కన రిటైనింగ్‌ వాల్‌ కట్టిన తర్వాత వరదలు వచ్చే పరిస్థితి లేనప్పుడు పట్టాలు ఇవ్వడానికి ఏం ఇబ్బంది వచ్చిందని ఆ ప్రాంత వాసులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల కనీసం 50 వేల మంది ఆక్రమణ స్థలాల్లో నివసిస్తున్న వారికి పట్టాలు రాలేదు. దాదాపు తొమ్మిది సంవత్సరాల క్రితం 50వేల నుంచి లక్ష రూపాయలు వరకు డిపాజిట్లు వసూలు చేసినా ఇప్పటికీ టిడ్కో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయలేదు. లబ్ధిదారులకు కేటాయించలేదు. వారిని అప్పులపాలు చేశారు. పదేళ్ల క్రితం విజయవాడ నగరంలో నిర్మించిన జేఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకంలో నిర్మించిన ఇళ్లు ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయి. వాటిని పేదలకు ఇవ్వకుండా నేతలు పంచుకుని అమ్ముకుంటున్నారు.

ప్రస్తుతం పంపిణీ చేస్తామని చెబుతున్న పట్టాలు 24,042

వీటిల్లో ఇప్పటికే పంపిణీ చేసినవి

21,456

కొత్తగా కూటమి ఇస్తున్న పట్టాలు

2,586

కొత్తగా ఇస్తున్న పట్టాలు కూడా షరతులతో ఇస్తున్నారు. రెండేళ్ల తర్వాతే పూర్తి హక్కులు కల్పిస్తామని చెబుతున్నారు. దీనివల్ల ఈ పట్టా లు ఇచ్చిన స్థలాల్లో ఇళ్లు కట్టుకోవాలంటే బ్యాంకు రుణాలు కూడా రాని పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వం ఇప్పటికై నా ఎన్నికల ప్రచారం కోసం కాకుండా పేదలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement