ఎన్‌ఎఫ్‌డీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ విజయ్‌కుమార్ బెహరా
లబ్బీపేట(విజయవాడ తూర్పు): అంతర్జాతీయంగా మారుతున్న పరిస్థితులు, అమెరికా విధిస్తున్న పన్నులు, ఆంక్షల వల్ల తీవ్ర ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొంటున్న ఆక్వా రంగానికి దేశీయ మార్కెట్ ఒక్కటే రక్ష అని జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు (ఎన్‌ఎఫ్‌డీబీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ విజయ్‌కుమార్ బెహరా పేర్కొన్నారు. ఎగుమతులపైనే పూర్తిగా ఆధారపడకుండా, దేశంలో రొయ్యలు, చేపల వినియోగాన్ని పెంచి, రైతులకు, ప్రాసెసింగ్ రంగానికి మద్దతు ఇవ్వాలన్నారు. విజయవాడలోని ఓ హోటల్‌లో మంగళవారం ‘శ్రింప్ రిటైల్–2026‘ సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఆక్వా పోస్ట్ జర్నల్‌ను అతిథుల ఆవిష్కరించారు. దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన ఆక్వా రైతులు, ప్రాసెసర్లు, రిటైలర్లు పరిశోధకులు రాబోయే రోజుల్లో దేశీయ ఆక్వా రంగాన్ని స్థిరమైన అభివృద్ధి దిశగా మార్చేందుకు అవసరమైన పలు కీలక ప్రణాళికలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఐసీఏఆర్ డెప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జేకే జేనా, శ్రింప్ రిటైల్ కన్వీనర్ ప్రభాస్ ప్రధాన్ తదితరులు పాల్గొన్నారు.


