జాతీయ రహదారిపై కారు దగ్ధం | - | Sakshi
Sakshi News home page

జాతీయ రహదారిపై కారు దగ్ధం

Sep 29 2026 1:45 AM | Updated on Sep 29 2026 1:45 AM

జాతీయ రహదారిపై కారు దగ్ధం

హనుమాన్‌జంక్షన్‌రూరల్‌: చైన్నె–కోల్‌కతా జాతీయ రహదారిపై బాపులపాడు మండలం కోడూరుపాడు వద్ద ఓ కారు అగ్నిప్రమాదానికి గురై దగ్ధమైన సంఘటన సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఎన్‌హెచ్‌–16 రహదారిపై కోడూరుపాడు ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి సమీపంలో గుంటూరు నుంచి తణుకు వెళ్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా అగ్నిజ్వాలలు, దట్టమైన మంటలు, పొగలతో కారు దగ్ధం కావటంతో హైవేపై ప్రయాణిస్తున్న వాహనదారులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యాయి. క్షణాల వ్యవధిలోనే కారు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యింది. అగ్ని ప్రమాదాన్ని ముందుగా పనికట్టిన ఆ కారు డ్రైవర్‌ చోడవరపు మోహన్‌ వరుణ్‌, ప్రయాణికులు చిట్టూరి గణేష్‌, అతని భార్య పూజిత హుటాహుటిన కిందకు దిగటంతో వారికి ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వీరవల్లి పోలీసులు, హనుమాన్‌జంక్షన్‌ అగ్నిమాపక సిబ్బంది హుటా హుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసి, రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement