లంక భూములను కై ంకర్యం చేస్తున్నారు | - | Sakshi
Sakshi News home page

లంక భూములను కై ంకర్యం చేస్తున్నారు

Sep 29 2026 1:39 AM | Updated on Sep 29 2026 1:39 AM

చిలకలపూడి(మచిలీపట్నం): పామర్రు నియోజక వర్గం పమిడిముక్కల మండలం లంకపల్లిలోని లంక భూములను అధికార పార్టీ నాయకులు కైంకర్యం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌ విమ ర్శించారు. కృష్ణా జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నియోజకవర్గ సమస్యలపై జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ.. భూముల రీ–సర్వేలో అవకతవకలు జరిగాయన్నారు. సుమారు 300 ఎకరాలను అధికార పార్టీకి చెందిన వారిని బినామీలుగా పెట్టి పట్టాదారు పాస్‌పుస్తకాలు మంజూరు చేయించారని, ఆ భూముల్లో ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇవ్వడం దారుణమని పేర్కొన్నారు. సొసైటీ భూములను నదీ గర్భంగా చూపించి వాటిని పేదలకు చెందకుండా చూస్తున్నారని విమర్శించారు. పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజా నేతృత్వంలో అధికార పార్టీకి చెందిన కోగంటి పూర్ణచంద్రరావు, ఘంటా సురేష్‌, ఘంటా కృష్ణచైతన్య ఇప్పటి వరకు రూ.200 కోట్ల ప్రభుత్వ సొమ్మును దోచుకున్నారని దుయ్యబట్టారు. ఎఫ్‌ఎల్‌ఆర్‌ నుంచి దొంగ వీలునామాలు సృష్టించి అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఉన్నతాధికారులు పాస్‌పుస్తకాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

గతంలో ఫిర్యాదు చేశాం

గతంలో ఈ భూముల వ్యవహారంపై కలెక్టర్‌ డి.కె.బాలాజీకి ఫిర్యాదు చేయగా పరిశీలిస్తానని చెప్పినా ఇంత వరకు చర్యలు తీసుకోలేదని అనిల్‌కుమార్‌ పేర్కొన్నారు. అధికారులే పాలకులకు సహాయ సహకారాలు అందిస్తూ, గ్రీన్‌ ట్రిబ్యునల్‌ తీర్పునకు వ్యతిరేకంగా రోజుకు 300 నుంచి 400 లారీల ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారని విమర్శించారు. బహి రంగ ఇసుక దోపిడీపై ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. జిలా ఎమ్మెల్యేలందరూ అవినీతిలో రాజ్యమేలుతున్నారని, అధికారుల తీరు చూస్తే కలెక్టరేట్‌కు వస్తే న్యాయం జరుగుతుందనే నమ్మకం పోతోందని ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో మాజీ సర్పంచ్‌ కనుమూరి వెంకటేశ్వరరావు, కొడాలి రాంబాబు, ముళ్లపూడి సోమయ్య, చొప్పరపు నాగేశ్వరరావు, ముళ్లపూడి రాజారత్నం, ముళ్లపూడి రుక్మిణి, పోతార్లంక కోటేశ్వరరావు ఉన్నారు.

మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement