గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని ఏపీ జేఏసీ జిల్లా చైర్మన్ డీఎస్‌ఎన్ రెడ్డి అన్నారు. ఈ నెల 5వ తేదీలోపు ఉద్యోగ సంఘాలను చర్చలకు సమస్యలపై చర్చించాలన్నారు. బుధవారం గాంధీనగర్‌లోని ఏపీఎన్జీవో కార్యాలయంలో జిల్లా జేఏసీ సమావేశం జరిగింది. సమావేశంలో ఉద్యోగుల ప్రధాన సమస్యల పరిష్కారం, ప్రభుత్వంతో చర్చలు, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ 12వ పీఆర్సీ కమిషన్ నియామకం, డీఏలు, సరెండర్ లీవ్‌లు, పెండింగ్ బకాయిల చెల్లింపులతో పాటు కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే మంత్రుల కమిటీ జేఏసీ సంఘాలతో సమావేశమై ఉద్యోగుల సమస్యలపై చర్చించినప్పటికీ ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించ లేదన్నారు. ప్రభుత్వం ఇకనైనా స్పష్టమైన నిర్ణయం తీసుకుని ఉద్యోగుల్లో నెలకొన్న అసంతృప్తిని తొలగించాలని కోరారు. సమావేశంలో జేఏసీ కో చైర్మన్ సయ్యద్ ఖాసీం, పి.రమేష్ ఎ. అనుగ్రహ ప్రసాద్, వైస్ చైర్మన్ జి.నారాయణరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ జి.రామకృష్ణ, జాయింట్ సెక్రటరీ విష్ణు వర్ధన్ రావు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
ఏపీ ఉద్యోగుల జేఏసీ
జిల్లా చైర్మన్ డీఎస్‌ఎన్ రెడ్డి


