న్యూస్‌రీల్
ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్వోలకు ఇవ్వండి లేదంటే ఓటు గల్లంతయ్యే అవకాశం ఎన్టీఆర్ జిల్లాలో శనివారం వరకు 83.16 శాతమే డిజిటలైజేషన్ ‘సర్’ గడువును పొడిగించాలని పలు వర్గాల నుంచి డిమాండ్
ఆదివారం శ్రీ 12 శ్రీ జూలై శ్రీ 2026
గందరగోళం
లోక్ అదాలత్‌తో శాశ్వత పరిష్కారం
7
వియత్నాం దేశంలోని ఫు క్వాక్ సముద్ర తీరంలో జరిగిన విహార యాత్ర విషాదాన్ని మిగిల్చింది. ఘటనలో బందరుకు చెందిన వ్యాపారవేత్త గెల్లి కిషోర్ భార్య మరణించగా ఆయన చికిత్స పొందుతున్నారు.
ఇంద్రకీలాద్రి: దుర్గమ్మ నిత్యాన్నదానానికి గుంటూరు వికాస్‌నగర్‌కు చెందిన రాయపాటి కోటి సుధాకర్ (సుబ్బారావు) రూ.1,08,616 విరాళాన్ని శనివారం అందజేశారు.
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని దక్షిణ కోస్తా రైల్వే జీఎం సందీప్ మాథ్యుర్ విజయవాడ డీఆర్‌ఎం మోహిత్ సోనాకియా, ఇతర అధికారులతో కలసి శనివారం కొవ్వూరు, గోదావరి స్టేషన్‌లలో ప్రయాణికుల సౌకర్యాలపై సమగ్ర తనిఖీ చేశారు. ముందుగా రాజమండ్రి స్టేషన్‌లో జరుగుతున్న స్టేషన్ పునరుద్ధరణ పనులను పరిశీలించారు. ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపర్చేందుకు అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ పనులను వేగవంతంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం గోదావరి, కొవ్వూరు స్టేషన్‌లను తనిఖీ చేసి పుష్కరాలకు తరలివచ్చే భక్తుల రద్దీ నివారణ చర్యలపై అధికారులతో సమీక్షించారు. రైల్వేస్టేషన్‌ల నుంచి నదీ తీరానికి మధ్య యాత్రికుల రాకపోకలను అంచనా వేసేందుకు పుష్కర ఘాట్, మార్కండేయ ఘాట్, శ్రద్ధానంద్ ఘాట్, సరస్వతి ఘాట్, గౌతమి ఘాట్‌లతో సహా ప్రధాన స్నాన ఘాట్‌లను తనిఖీ చేశారు. అనంతరం రాజమండ్రిలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి పుష్కరాల ఏర్పాట్లపై సమీక్షించారు. పుష్కరాలకు వచ్చే లక్షలాది మంది ప్రయాణికుల భద్రత, జన సమూహ నిర్వహణ వ్యూహాలు, అత్యవసర వైద్య ఏర్పాట్లపై సమీక్షించారు. భారీ సంఖ్యలో వచ్చే ప్రయాణికులను సమర్థంగా నిర్వహించేందుకు రైల్వే, రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో పని చేస్తుందని జీఎం తెలిపారు. ఈ సమావేశంలో రాజమండ్రి జిల్లా ఎస్పీ డి.నరసింహా కిషోర్, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అంకుష్‌గుప్తా, ప్రిన్సిపల్ చీఫ్ ఇంజినీర్ బీఎస్‌కే రాజ్‌కుమార్, ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ సాంబశివరావు, ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ ఏకే సిన్హా తదితరులు పాల్గొన్నారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను రాష్ట్ర కార్మిక, ఫ్యాక్టరీల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కుటుంబ సమేతంగా శనివారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన సుభాష్‌కు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వదించారు. ఆలయ పర్యవేక్షకుడు నాగేశ్వరరావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు అవ్వారు శ్రీనివాసరావు(బుల్లాబ్బాయ్) అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.
గుంటుపల్లి(ఇబ్రహీంపట్నం): చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ చెప్పారు. గుంటుపల్లి రైజ్ కేంద్రంలో మిల్లెట్ ఫుడ్ ప్రొడక్ట్స్ వర్క్‌షాప్‌ను కలెక్టర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీచుపదార్థం, ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉండే చిరుధాన్యాలు ఆరోగ్యకర జీవితానికి పునాదులు వేస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో చిరుధాన్యాల విలువ ఆధారిత ఆహార ఉత్పత్తులకు డిమాండ్ ఉందని, ఈ అవకాశాన్ని వినియోగించుకుని మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని సూచించారు. శిక్షణ కార్యక్రమాల ద్వారా అనేక మంది మహిళలు ఇప్పటికే పారిశ్రామిక యూనిట్లు ఏర్పాటు చేశారన్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని ముందడుగు వేయాలని కలెక్టర్ లక్ష్మీశ పిలుపునిచ్చారు. 80 మంది స్వయం సహాయక సంఘ మహిళలకు 9నట్స్ సీఈవో వి.కీర్తన చిరుధాన్యాలతో తయారయ్యే ఆహార ఉత్పత్తులపై అవగాహన కల్పించారు. డీఆర్‌డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు తదితరులు పాల్గొన్నారు.
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు ఐటీఐ కళాశాలల్లో అడ్మిషన్ల కోసం నగరంలోని రమేష్ ఆస్పత్రి రోడ్డులో ఉన్న ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో శనివారం కౌన్సెలింగ్ ప్రారంభమైంది. మొదటి అడ్మిషన్‌ను మెరిట్ నంబర్ 3 పొందిన ఎం.మణికంఠకు విజయవాడ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో డీజిల్ మెకానిక్ విభాగంలో సీటు కేటాయిస్తూ అడ్మిషన్ లెటర్‌ను కౌన్సెలింగ్ ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ ఎం.కనకారావు అందజేశారు. శనివారం మొత్తం 141 మంది విద్యార్థులకు వివిధ కళాశాలల్లో సీట్లు కేటాయించారు. కౌన్సెలింగ్ ఆది, సోమవారాలు కూడా కొనసాగుతుంది.
ఘనంగా ఏపీఎస్‌ఆర్టీసీ ఈయూ వజ్రోత్సవాలు
బస్టాండ్(విజయవాడ పశ్చిమ): ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ 75వ ఆవిర్భావ వేడుకలు విజయవాడ జోన్ పరిధిలోని ఆటోనగర్, గవర్నర్‌పేట 1, 2 డిపోలలో శనివారం ఘనంగా నిర్వహించారు. జోనల్ కార్యదర్శి వైఎస్ రావు మాట్లాడుతూ 1952 నుంచి ఉద్యోగుల సమస్యలపై పోరాడుతున్నామన్నారు. కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులరైజేషన్ అలవెన్సుల సాధనలో, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడంలో తమ యూనియన్ ఘనమైన పాత్ర పోషించిందని చెప్పారు. ఏపీఎస్ ఆర్టీసీని పరిరక్షించేందుకు తమ యూనియన్ కట్టుబడి ఉందని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శలు, డిపోల కార్యదర్శలు, జోనల్ అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.
ఓటు.. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడి అత్యంత విలువైన హక్కు. దాన్ని కొనసాగించుకోవాలంటే ప్రస్తుతం కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి ఓటరూ భాగస్వామి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంటింటి సర్వేలో భాగంగా బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు) అందజేస్తున్న ఎన్యూమరేషన్ ఫారాలను నింపి గడువులోగా తిరిగి వారికి అందజేయాల్సి ఉంది. ఇందుకు ఇంకా మూడు రోజులే గడువు ఉండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తం చేస్తోంది. ఓటరన్నా మేలుకో.. ఐదేళ్ల భవిష్యత్తును మార్చే ఓటు అనే ఆయుధాన్ని నీ చేతిలో ఉంచుకో.. త్వరపడు.
సాక్షి, విజయవాడ/గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఓటు హక్కును కాపాడుకోవడానికి ఓటర్లు అప్రమత్తంగా ఉండాలి. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా బీఎల్వోలు ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేస్తున్నారు. వీటిని పూర్తి చేసి తిరిగి వారికి అందించాలి. దీనికి ఇంకా మూడు రోజులు మాత్రమే గడువు ఉంది. లేదంటే ఓట్లు గల్లంతయ్యే చాన్స్ ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ కార్పొరేషన్‌తో పాటు పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు అందించిన ఫారాలను డిజిటలైజేషన్ చేయడంలో సాంకేతిక సమస్య (సర్వర్ డౌన్) కారణంగా ఆలస్యమవుతోందని సచివాలయ సిబ్బంది నుంచి వినిపిస్తోంది. గడువు సమీపిస్తుండటంతో వీలైనంత ఎక్కువ శాతం డిజిటలైజేషన్ చేయాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నా ఆ స్థాయిలో జరగడం లేదు.
పట్టణాల్లోనే ఎక్కువ సమస్యలు..
ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని విజయవాడ కార్పొరేషన్‌తో పాటు ఇబ్రహీంపట్నం, తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట తదితర పట్టణ ప్రాంతాల్లో ఫారాలు సమర్పించని వారే ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు ఇతర ప్రాంతాలకు వెళ్లడంతో బీఎల్వోలకు వారి చిరునామాలు వెదికే పనిలో ఉన్నారు.
జిల్లాలో ఇంకా 2.84 లక్షలకు పైగా పెండింగ్
ఎన్టీఆర్ జిల్లాలో 17,13,445 మంది ఓటర్లు ఉండగా.. ఇప్పటి వరకు 17,09,204 ఫారాలు పంపిణీ చేశారు. శనివారం వరకు 14,24,982 (83.16 శాతం) ఫారాలను డిజిటలైజేషన్ చేశారు. ఇంకా 2,84,222 (16.84శాతం) ఫారాలు పెండింగ్‌లో ఉన్నాయి.
రెండు రోజులు ప్రత్యేక శిబిరాల ఏర్పాటు
‘సర్’ వేగవంతం చేయడానికి 11, 12 తేదీల్లో రెండు రోజుల పాటు జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఏడు నియోజకవర్గాల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయించారు. మిగిలిపోయిన వాళ్లంతా వచ్చి ఫారాలను పూర్తి చేసి బీఎల్వోలకు అందిస్తే డిజిటలైజేషన్ పూర్తి చేస్తారని చెబుతున్నారు. ఇప్పటికీ ఇంకా అసలు ఫారాలే అందనివారు, తిరిగి సమర్పించని వాళ్లను ఈ రెండు రోజుల్లో మరోసారి వారి ఇళ్లకు వెళ్లి తనిఖీ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఏదైనా సందేహం వస్తే 1950 టోల్‌ఫ్రీ నంబర్‌కు చేసి నివృత్తి చేసుకోవాలని చెబుతున్నారు.
గడువును పొడిగించాలని డిమాండ్
ఈ నెల 14వ తేదీ కేంద్రం ఎన్నికల సంఘం ఇచ్చిన గడువు ముగియనున్న నేపథ్యంలో సర్ ప్రక్రియను పొడిగించాలని పలు ప్రజాసంఘాలు, పలు యూనియన్ల నేతలు డిమాండ్ చేస్తున్నారు. జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే సర్ ప్రక్రియ గడువు పొడిగించే అవకాశాలు లేవని ఉన్నతాధికారుల నుంచి వస్తున్న సమాచారం. మరోవైపు గ్రామాలు, పట్టణాల్లో రెండుచోట్లా ఓటు హక్కు ఉన్నవారు ఒకచోట మాత్రమే ఉంచుకోవాల్సిన పరిస్థితి తప్పనిసరి కావడంతో రాజకీయ నాయకులు తమ నియోజకవర్గాల్లో ఫైనల్‌గా ఎన్ని ఓట్లు ఉంటాయనే దాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు.
టైమ్ లేదు.. ఫారాలు ఇచ్చేస్తేనే ఓటు
ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో.. బీఎల్వోలు మరోసారి ఓటర్ల ఇళ్లకు వెళ్లి ఇంకా ఫారం తీసుకోని వారిని, తీసుకుని ఇవ్వని వారి కోసం వెతుకుతారా ? అంటే ప్రస్తుతం కష్టమే. ఎందుకంటే డిజిటలైజేషన్ ప్రక్రియ చాలా కీలకం. సర్వర్ సమస్యతో రాత్రి వేళ కూడా ఫారాల డిజిటలైజేషన్ చేయాల్సి వస్తోందని పలువురు సచివాలయ సిబ్బంది చెబుతున్నారు.
ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ డైరెక్టర్ బి.ఎస్.కోటేశ్వరరావు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బాలల హక్కుల పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిదని ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ డైరెక్టర్ శ్రీ.బి.ఎస్. కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. శనివారం హనుమాన్‌పేటలోని తానా భవన్‌లో ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ ఆధ్వర్యంలో ‘బాలల హక్కుల సేవలను మరింత బలోపేతం చేసి విస్తరించడానికి భవిష్యత్ కార్యాచరణ‘ అనే అంశంపై చర్చావేదిక జరిగింది. కోటేశ్వరరావు మాట్లాడుతూ బాలల రక్షణ, సంరక్షణ, విద్య, ఆరోగ్యం, బాల కార్మిక నిర్మూలన, బాల్య వివాహాల నివారణ, బాలల అక్రమ రవాణా నిరోధం వంటి అంశాల్లో ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలు, పోలీసులు, సమాజంలోని ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు. ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ వ్యవస్థాపన సభ్యులు, బాలల సేవలో రాష్ట్రపతి అవార్డు గ్రహీత ఫాదర్ థామస్ కోషి మాట్లాడుతూ సమాజ స్థాయిలో బాలల రక్షణ వ్యవస్థలను మరింత బలోపేతం చేయడం, గ్రామ, వార్డు స్థాయిలో బాలల హక్కుల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం, బాలల సమస్యల పరిష్కారానికి భవిష్యత్ కార్యాచరణ రూపొందించడాన్ని వివరించారు. ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ కోఆర్డినేటర్ అరవ రమేష్ మాట్లాడుతూ బాలల హక్కుల రంగంలో పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, విద్యావేత్తలు, న్యాయ నిపుణులు, ఇతర భాగస్వాములు ముందుకు రావాలని కోరారు. బాలల సంక్షేమం కోసం ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగాలని సమావేశం నిర్ణయించింది. అనంతరం ‘బాలల భద్రత – అందరి బాధ్యత ‘ అనే పోస్టర్‌ను ఆవిష్కరించారు. చర్చావేదికలో హక్కుల కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సంతోష్, జె.ఎల్.వి. ప్రసాద్, పి.రత్నం, కాజా చంద్ర, ఫ్రాన్సిస్ తంబి, శారద, అనిల్ కుమార్, జోన్స్ మానికొండ, ఆర్‌ఎస్ రాజు పాల్గొన్నారు.
చిలకలపూడి(మచిలీపట్నం): వివాదాలకు దూరంగా ఉంటూ ప్రశాంతమైన జీవనం గడపాలంటే జాతీయ లోక్‌అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. గోపి అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయసేవాసదన్‌లో శనివారం ఆయన జాతీయ లోక్‌అదాలత్ కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. న్యాయమూర్తి మాట్లాడుతూ మనిషి జీవితంలో ఆనందం ఎంతో ముఖ్యమని అదే ఆయుష్షును పెంచుతుందన్నారు. దీనికోసం వివాదాలకు దూరంగా ఉండాలన్నారు. కోర్టుల చుట్టూ సంవత్సరాల పాటు తిరుగుతూ సమయం, నగదు వృథా చేసుకునే బదులు పరస్పర రాజీ ద్వారా సమస్యలను పరిష్కరించుకుంటే ఇరుపక్షాలు సంతృప్తితో ప్రశాంతంగా జీవించగలరన్నారు. జాతీయ లోక్‌అదాలత్‌కు వచ్చిన ప్రతి ఒక్కరూ తమ కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకోవడానికి ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎస్.వరలక్ష్మి, మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి కె.సునీత, పోక్సో కోర్టు న్యాయమూర్తి రాజా వెంకటాద్రి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు తుంగల హరిబాబు తదితరులు పాల్గొన్నారు.
1,15,261 కేసుల పరిష్కారం
లోక్‌అదాలత్‌లో 1,15,261 కేసులు పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గోపి తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 45 బెంచ్‌ల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. వీటిలో 1,07,628 క్రిమినల్ కేసులు, 439 సివిల్ కేసులు, 692 చెక్‌బౌన్స్ కేసులు, 6356 ప్రీలిటిగేషన్ కేసులు పరిష్కరించామన్నారు. 146 మోటారు వాహన ప్రమాద క్లయిమ్‌లకు రూ. 9.2 కోట్లు నష్టపరిహారంగా చెల్లించేందుకు అంగీకరించాయన్నారు. మచిలీపట్నం కోర్టులో 9182 కేసులు, విజయవాడలో 33,971, గుడివాడలో 15,237, నందిగామలో 11,430, నూజివీడులో 11,669, మైలవరం 1830, జగ్గయ్యపేట 4735, బంటుమిల్లిలో 2238, కై కలూరులో 1053, తిరువూరులో 5313, గన్నవరం 9821, అవనిగడ్డలో 3160, మొవ్వ 2284, ఉయ్యూరు 3338 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు.
జిల్లా తాజా సమాచారం
నియోజకవర్గం శాతం డిజిటలైజేషన్
చేసిన దరఖాస్తులు
విజయవాడ వెస్ట్ 78.79 2,02,479
విజయవాడ సెంట్రల్ 79.60 2,21,148
విజయవాడ ఈస్ట్ 80.58 2,17,346
మైలవరం 85.05 2,42,539
నందిగామ 85.69 1,77,791
జగ్గయ్య పేట 85.95 1,78,397
తిరువూరు 88.78 1,85,282
కొన్నిచోట్ల డిజిటలైజేషన్ గందరగోళమైంది. కొత్త ఫొటోలు ఇవ్వాలని ఆదేశాలున్నా తుది దశకు వచ్చేసరికి పాతవి అలానే ఉంచేసి డిజిటలైజేషన్ చేసేస్తున్నారు. ఇదేమిటని బీఎల్వోలను అడిగితే పై నుంచి ఆదేశాలు అంటున్నారు. ఇంకొందరు ఫారాలు ఇవ్వకుండానే తమ వద్ద ఉన్న వివరాలతో డిజిటలైజేషన్ పూర్తి చేసినట్లు చెబుతున్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని సుమారు 10 డివిజన్లలో ఒక్కో బూత్‌లో 200 నుంచి 300 మంది అడ్రస్‌లు దొరకడం లేదు. వీరి ఫారాలు ఇంకా బీఎల్వోల వద్దనే ఉన్నాయి. ఏ ఒక్కరి ఓటు కూడా పోకూడదన్న ఉద్ద్ధేశంతో వారి వివరాలను ముందు ఆన్‌లైన్ చేసేస్తున్నారు. ఓటర్ల జాబితాలో ప్రతి ఓటును కాపాడుకోవాల్సి ఉంది.


