మచిలీపట్నంలో కీచక అర్చకుడు | - | Sakshi
Sakshi News home page

మచిలీపట్నంలో కీచక అర్చకుడు

Mar 20 2026 9:19 AM | Updated on Mar 20 2026 9:19 AM

మచిలీపట్నంలో కీచక అర్చకుడు

కోనేరుసెంటర్‌(మచిలీపట్నం): మచిలీపట్నంలో ఓ కీచక అర్చకుడి వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసు వివరాలను బందరు ఇన్‌చార్జ్‌ డీఎస్పీ ధర్మేంద్ర ఆర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. మచిలీపట్నంలోని లక్ష్మణరావుపురం రామాలయంలో నిజాంపేటకు చెందిన ఎ.రఘునాథశర్మ అర్చకుడిగా పనిచేస్తున్నాడు. అతని ఇంట్లో ఓ కుటుంబం అద్దెకు ఉంటోంది. ఆ కుటుంబంలో ఇంటర్మీడియెట్‌ చదువుతున్న బాలిక ఉంది. ఆమైపె అర్చకుడు రఘునాథశర్మ కన్నేశాడు. ఆమెను తొలుత తన భార్యకు దగ్గర చేశాడు. అనంతరం బాలికతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. వారి కుటుంబం ఎక్కడికి వెళ్లినా భార్యాపిల్లలతో పాటు ఆ బాలికనూ తీసుకెళ్లేవాడు. మాయమాటలు చెప్పి గత ఏడాది డిసెంబర్‌ నుంచి ఇప్పటి వరకు అనేకమార్లు ఆమైపె లైంగికదాడి చేశాడు. బాలిక బుధవారం నలతగా ఉండటంతో తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు పరీక్షించి బాలిక గర్భంధరించిందని నిర్ధారించారు. తల్లిదండ్రులు ఆగ్రహంతో అందుకు కారణం ఎవరంటూ బాలికను ప్రశ్నించారు. తాను గర్భం దాల్చటానికి కారణం రఘునాథశర్మ అని ఆమె చెప్పటంతో తల్లిదండ్రులు వెంటనే ఆర్‌పేట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు రఘునాథశర్మను అరెస్ట్‌ చేశారు. ఈ సమావేశంలో ఆర్‌పేట సీఐ ఏసుబాబు, ఎస్‌ఐ యోహాను, స్టేషన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

బాలికపై యువకుడి లైంగికదాడి

చిట్టినగర్‌(విజయవాడపశ్చిమ): ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని బాలికను నమ్మించిన యువకుడు ఆమైపె లైంగిక దాడికి పాల్పడిన ఘటన విజయవాడ కొత్తపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పాత రాజరాజేశ్వరిపేటలో చోటు చేసుకుంది. ఘటనపై బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. విజయవాడ పాతరాజరాజేశ్వరికి చెందిన బాలిక తొమ్మిదో తరగతి వరకు చదువుకుని మధ్యలో మానేసి ఇంటి వద్దే ఉంటోంది. అదే ప్రాంతంలో నివసించే దేవరపాటి రాజేష్‌ అలియాస్‌ నాని కళ్లు ఆ బాలికపై పడ్డాయి. బాలికతో మాట్లాడుతూ చనువుగా ఉండటమే కాకుండా ప్రేమిస్తున్నాని నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక రెండు రోజులుగా అనారోగ్యంగా ఉండటంతో ఆమె తల్లి ఏం జరిగిందని ఆరా తీసింది. దీంతో జరిగిన విషయం బాలిక తల్లికి చెప్పింది. బాలిక తల్లి కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement