దుర్గగుడిలో పలువురికి అంతర్గత బదిలీలు | - | Sakshi
Sakshi News home page

దుర్గగుడిలో పలువురికి అంతర్గత బదిలీలు

Mar 20 2026 9:19 AM | Updated on Mar 20 2026 9:19 AM

దుర్గగుడిలో పలువురికి అంతర్గత బదిలీలు

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో సూపరింటెండెంట్లు, జూనియన్‌ అసిస్టెంట్లను అంతర్గత బదిలీ చేస్తూ ఆలయ ఈఓ శీనానాయక్‌ గురువారం ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన ఆలయంలో విధులు నిర్వహిస్తున్న సూపరింటెండెంట్‌ కె.శ్రీనివాసరావు(చందు)కు సత్రాలు, వేద పాఠశాల, దత్తత ఆలయాలకు బదిలీ చేశారు. వేదపాఠశాల, దత్తత దేవాలయాల విధులు నిర్వహిస్తున్న సూపరింటెండెంట్‌ వి.సత్యనారాయణమూర్తికి కేశఖండనశాల, దుర్గాఘాట్‌, కృష్ణమ్మ హారతుల నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. కేశఖండనశాల, దుర్గాఘాట్‌, ఆడిట్‌ జనరల్‌ విధులు నిర్వహిస్తున్న హేమ దుర్గాంబకు ఆడిట్‌, జనరల్‌, అన్న దానం విధులు అప్పగించారు. జూనియర్‌ అసిస్టెంట్‌ ఎం.రమేష్‌ను ప్రధాన ఆలయం నుంచి పారిశుద్ధ్య విభాగానికి బదిలీ చేశారు. అక్కడ పనిచేస్తున్న వి.జగన్నాథరావును ప్రధాన ఆలయ ఇన్‌స్పెక్టర్‌ బాధ్యతలు అప్పగించారు.

కేవీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

మచిలీపట్నంటౌన్‌: స్థానిక పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయలో 2026–27 విద్యా సంవత్సరానికి ఒకటో తరగతిలో ప్రవేశాల కోసం ఆన్‌లైన్లో పేర్లు నమోదు ప్రక్రియ ఈ నెల 20వ తేదీ ఉదయం పది గంటలకు ప్రారంభమై ఏప్రిల్‌ రెండో తేదీతో ముగుస్తుందని విద్యాలయ ప్రిన్సిపాల్‌ మహమ్మద్‌ ఆసిఫ్‌ హుస్సేన్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్రీయ విద్యాలయాలో ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాలు https:// machilipatnam. kvs.ac.in అనే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఒకటో తరగతి ప్రవేశం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి https:// admission.kvs.gov.in లింక్‌ ద్వారా నమోదు చేసుకోవాలన్నారు. ఒకటో తరగతిలో ప్రవేశానికి కనీస వయస్సు ఆరు ఏళ్లు ఉండాలని అన్ని తరగతులకు సంబం ధించి వయస్సు నిర్ధారణను 31.03.2026 నాటికి పరిగణనలోకి తీసుకుంటామని తెలి పారు. సీట్ల రిజర్వేషన్‌ అనేది కేవీఎస్‌ ప్రవేశ మార్గదర్శకాలు 2026–27 ప్రకారం అమలు చేస్తామని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న, అర్హత కలిగిన వారు తక్షణమే దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

నాగిరెడ్డికి మాతృవియోగం

నందివాడ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవసాయ మిషన్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ ఎం.వి.ఎస్‌. నాగిరెడ్డి మాతృ మూర్తి మలిరెడ్డి నాగసుందర మణిమ్మ (89) గురువారం మరణించారు. మణిమ్మకు ఇద్దరు కుమారులు. వైఎస్సార్‌ సీపీ గుడివాడ నియోజకవర్గ నాయకులు పలువురు ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు నందివాడ మండలం జనార్దనపురంలో నాగసుందర మణిమ్మ అంతిమయాత్ర జరుగుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement