నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం
నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం మోపిదేవి: మోపిదేవి శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానంలో నిర్వహించే నిత్యన్నదాన పథకానికి శనివారం మిర్యాలగూడ వాస్తవ్యులు వంగపల్లి పుల్లయ్య, చంద్రకళ దంపతులు రూ.1,00,001 విరాళంగా సమర్పించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయ అధికారి బివై కిషోర్‌ని కలిసి విరాళాన్ని అందజేశారు. దాత కుటుంబసభ్యులను అధికారులు ఆలయ మర్యాదలతో సత్కరించారు.
సుబ్రహ్మణ్యేశ్వరుడిని
దర్శించుకున్న ఆజాద్
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారిని దేవాదాయ, ధర్మాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్‌ఆజాద్ శనివారం దర్శించుకున్నారు. తొలుత ఆలయ ప్రదక్షణ చేసిన ఆయన నాగపుట్టలో పాలుపోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు వెంకటేశ్వరావు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించి తీర్థప్రసాదాలు అంద జేశారు. ఆలయ సూపరిండింటెంట్ అచ్యుత మధుసూదనరావు ఆయనకు స్వామివారి చిత్రపటం, లడ్డుప్రసాదాలు అందించి ఆలయ మర్యాదలతో సత్కరించారు.
పరికరాల కొనుగోలుకు
అనుమతి కోరాం
ఈంఎస్ డైరెక్టర్ ఆంజనేయులు లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడలోని ఈస్‌ఐ ఆస్పత్రిలో అవసరమైన వైద్య పరికరాలు కొనుగోలు కోసం ఇ–టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వ అనుమతి కోరినట్లు ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్(ఐఎంఎస్) డైరెక్టర్ వి.ఆంజనేయులు తెలిపారు. ‘సాక్షి’ దినపత్రికలో ‘ఈసురోమంటూ ..ఈస్‌ఐ’ శీర్షికన శనివారం ప్రచురించిన కథనానికి ఆయన స్పందించారు. ప్రభుత్వం ఆమోదం అందిన వెంటనే మౌలిక సదుపాయాలను బలోపేతం చేసి, అందుబాటులో ఉన్న సేవల పరిధిని మెరుగుపరిచే పక్రియను చేపడతామని తెలిపారు. ఇన్‌హౌస్ చికిత్సలు నిర్వహించడం ద్వారా ప్రైవేటు ఆస్పత్రులకు రిఫరల్ చేయాల్సిన అవసరం తగ్గుతుందన్నారు. అంతేకాకుండా ప్రైవేటు ఆస్పత్రిల్లో డబ్బులు వసూలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. సీఆర్‌డీఏ పరిధిలో 500 పడకలతో సెకండరీ కేర్ హాస్పిటల్, 150 పడకలతో సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు అంశం ప్రాసెస్‌లో ఉన్నట్లు ఆయన వివరించారు.
వైద్య కళాశాలలను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడపాలి
ఏపీ రైతు సమాఖ్య సదస్సు తీర్మానం
గాంధీనగర్ (విజయవాడసెంట్రల్): రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలని ఏపీ రైతు సమాఖ్య సదస్సు తీర్మానించింది. శనివారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సదస్సులో పతాకావిష్కరణ చేసి, అమరవీరులకు నివాళులర్పించారు. పీపీపీ పద్ధతిలో వైద్య కళాశాలల ప్రైవేటీకరణను ఆపాలని వక్తలు డిమాండ్ చేశారు. అలాగే, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలని, 58 ఏళ్లు నిండిన రైతు, వ్యవసాయ కార్మికులు, చేతి వృత్తిదారులు, కళాకారులకు నెలకు రూ.10 వేలు పెన్షన్ ఇవ్వాలని, రైతులకు 90 శాతం సబ్సిడీలతో ఎరువులు, పురుగు మందులు, విత్తనాలను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. పేదలకు ఉచిత నాణ్యమైన విద్య, వైద్యం అందించాలని తీర్మానించారు. అనంతరం సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఏఐకేఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ అధ్యక్షుడిగా కొమ్ముల సురేష్, ప్రధాన కార్యదర్శిగా మర్రెడ్డి వెంకటరెడ్డి, కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.
1/3
నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం
2/3
నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం
3/3
నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం