మంత్రి నాదెండ్ల మనోహర్
పెనమలూరు: రాష్ట్రంలో చౌక దుకాణాల ద్వారా పారదర్శకంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయటానికి స్మార్ట్ రేషన్‌కార్డులు ఉపయోగపడతాయని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కృష్ణాజిల్లా పోరంకిలో సోమవారం పౌరసరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్‌గౌర్, జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మలతో కలిసి స్మార్ట్ రేషన్‌కార్డులు పంపిణీ చేశారు. మంత్రి మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్తగా ఒక కోటి 46 లక్షల గృహాలకు 4.42 కోట్ల స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామన్నారు. కార్డులో ఉన్న క్యూ ఆర్‌కోడ్‌ను స్కాన్ చేస్తే కార్డుదారుడు తీసుకున్న నిత్యావసర సరుకుల వివరాలు ఫోన్‌కి వస్తుందన్నారు. కార్డుదారులకు ఇబ్బంది వస్తే 196 కాల్ సెంటర్‌కు కాల్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బోడెప్రసాద్, డీఎస్‌వో మోహన్‌బాబు, ఆర్డీవో బీఎస్ హేలాషారోన్, తహసీల్దార్ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
అక్రమాలు అరికట్టేందుకు..
గుణదల(విజయవాడ తూర్పు): రింగ్ రోడ్డు సమీపంలోని వరలక్ష్మీనగర్‌లో స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రేషన్ పంపిణీలో అక్రమాలను అరికట్టేందుకు ఈ స్మార్ట్ కార్డులు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో తూర్పు ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, పౌరసరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు.