
సువర్ణ శోభితం... కృష్ణవేణి సోయగం
ఇదేదో ప్రఖ్యాత చిత్రకారుడు గీసిన అద్భుత చిత్రంలా ఉంది కదూ...ఆకాశం కాన్వాస్‌పై ప్రకృతి గీసిన చిత్రం ఇది. నాగాయలంక శ్రీరామపాదక్షేత్రంలో బుధవారం సాయం సంధ్య వేళ కనువిందు చేసిన దృశ్యకావ్యం. ఓ వైపు కృష్ణానదికి తూర్పువైపు మండపాన కొలువైన శ్రీరామలింగేశ్వర స్వామికి సూర్య కిరణాలతో వింజామర వీచినట్లు అస్తమించిన సూర్యుని కిరణాలు ఉవ్వెత్తున పైకిలేచి శివయ్యకు రంగు రంగుల వింజామరను పరచినట్లు ఆహ్లాదకరమైన ప్రకృతి దృశ్యం ఆవిష్కృతమైంది. మరోవైపు కృష్ణవేణి మాత విగ్రహం సువర్ణ నదీ జలాల్లో విహరిస్తున్నట్టు శోభాయమానంగా మెరిసింది. ఈ అందమైన దృశ్యాన్ని ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది.
–నాగాయలంక

సువర్ణ శోభితం... కృష్ణవేణి సోయగం

సువర్ణ శోభితం... కృష్ణవేణి సోయగం