
ఏఐఎస్‌జీఈఎఫ్ ఉపాధ్యక్షుడు విద్యాసాగర్‌కు స్వాగతం
విమానాశ్రయం(గన్నవరం):అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య జాతీయ ఉపాధ్యక్షుడిగా ఎన్నికై న ఏపీ ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్, జాతీయ కార్యవర్గ సభ్యుడైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీవీ రమణకు ఆ సంఘ నేతలు గన్నవరం విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. జాతీయ సమావేశానికి హాజరైన ఈ ఇరువురు న్యూఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి మంగళవారం రాత్రి చేరుకున్నారు. విమానాశ్రయంలో వీరికి ఎన్టీఆర్ జిల్లా సంఘ అధ్యక్షుడు డి.సత్యనారాయణరెడ్డి, కార్యదర్శి పి.రమేష్, కోశాధికారి సతీష్, కార్యనిర్వాహక కార్యదర్శి రమణ, ఉపాధ్యక్షులు రామకృష్ణ, రాజబాబు, విజయవాడ నగర అధ్యక్షుడు సీవీఆర్ ప్రసాద్, గన్నవరం తాలుకా యూనిట్ అధ్యక్షుడు సాంబశివరావు తదితరులు స్వాగతం పలికారు.
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): విజయవాడ రైల్వే డీఆర్‌ఎం మోహిత్ సోనాకియా బుధవారం గూడూరు–విజయవాడ సెక్షన్‌లో విస్తతంగా తనిఖీలు చేపట్టారు. నెల్లూరు స్టేషన్‌లో అమృత్ భారత్ పథకంలో జరుగుతున్న స్టేషన్ పునరాభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించారు. ముందుగా అధికారులతో కలసి డీఆర్‌ఎం గూడూరు స్టేషన్‌లోని ప్లాట్‌ఫాంలు, స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలు, భద్రతా చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పలు సూచనలు చేశారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తూ సకాలంలో పనులను పూర్తిచేయాలని ఆదేశించారు. అక్కడ నుంచి నెల్లూరు స్టేషన్‌కు చేరుకుని స్టేషన్ ఆధునికీకరణ పనులను పర్యవేక్షించారు. నూతన భవన నిర్మాణాలు, ప్లాట్‌ఫాం పనులను పర్యవేక్షించి సకాలంలో పూర్తిచేయాలన్నారు. స్థానిక సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రత్యేక ప్రవేశ ద్వారాలు నెల్లూరు స్టేషన్‌కు ఆకర్షణగా నిలుస్తాయని తెలిపారు. అనంతరం బిట్రగుంట, సింగరాయకొండ, ఒంగోలు స్టేషన్‌లను సందర్శించి సిబ్బందికి అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. డివిజన్‌లో గూడూరు–విజయవాడ సెక్షన్ అత్యంత కీలకమైనదన్నారు. ఈ సెక్షన్‌లో ప్రపంచ స్థాయి ఆధునిక సౌకర్యాల దిశగా అమృత్ భారత్ స్టేషన్ పథకంలో పనులు వేగంగా చేపట్టినట్లు తెలిపారు. ఈ పనులు త్వరితగతిన పూర్తిచేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.

ఏఐఎస్‌జీఈఎఫ్ ఉపాధ్యక్షుడు విద్యాసాగర్‌కు స్వాగతం