ఎమ్మెల్యే దగ్గుపాటి బహిరంగ క్షమాపణలు చెప్పాలి | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే దగ్గుపాటి బహిరంగ క్షమాపణలు చెప్పాలి

Aug 19 2025 6:46 AM | Updated on Aug 19 2025 6:46 AM

ఎమ్మె

ఎమ్మెల్యే దగ్గుపాటి బహిరంగ క్షమాపణలు చెప్పాలి

ఎమ్మెల్యే దగ్గుపాటి బహిరంగ క్షమాపణలు చెప్పాలి రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు చోరీ

మచిలీపట్నంటౌన్‌: ప్రముఖ సినీ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలపై మచిలీపట్నంలో ఎన్టీఆర్‌ అభిమానులు సోమవారం మండిపడ్డారు. స్థానిక బస్టాండ్‌ సెంటర్లో ఎన్టీఆర్‌ విగ్రహానికి, జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్లెక్సీ చిత్ర పటాలకు పూలమాలలు వేసి క్షీరాభిషేకం నిర్వహించారు. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్‌కు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఓ ప్రజాప్రతినిధిగా ఉన్న దగ్గుపాటి ప్రసాద్‌ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని, ఆయన క్షమాపణ చెప్పకపోతే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న అభిమానులను కలుపుకొని ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తా మని పలువురు అభిమానులు హెచ్చరించారు.

బంటుమిల్లి: మండల పరిధిలోని అర్తమూరు పంచాయతీ శివారు బాసినపాడు గ్రామం వద్ద 216 జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. సేకరించిన వివరాల మేరకు.. మండల పరిధిలోని మల్లంపూడి గ్రామానికి చెందిన మహిళా కూలీలు వ్యవసాయ పనుల నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్లి వస్తుంటారు. దీని కోసం మల్లంపూడి గ్రామం నుంచి కలుపు తీతలకు వెళ్లిన కూలీలు తిరిగి స్వగ్రామం వస్తుండగా.. బాసినపాడు గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి కూలీల ఆటో తిరగబడింది. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన నలుగురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని జాతీ య రహదారి టోల్‌గేట్‌ అంబులెన్స్‌లో మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. వీరిలో కొల్లాటి నాగమణి(50) పరిస్థితి విషమంగా ఉన్నందున మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించింది. మిగిలినవారు బందరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రతిరోజు కుటుం బ పోషణ కోసం పెడన, గుడ్లవల్లేరు ప్రాంతాల కు రాకపోకలు చేస్తున్న మహిళలు ప్రమాద బారి న పడిన సంఘటన గ్రామంలో విషాదం నింపింది. ఈ ప్రమాదంపై ఎటువంటి కేసు నమోదు చేయలేదని ఎస్‌ఐ గణేష్‌కుమార్‌ తెలిపారు.

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌: ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తి బలవంతంగా లాక్కొని పరారైన ఘటన సోమవారం హనుమాన్‌జంక్షన్‌లో చోటు చేసుకుంది. స్థానిక ఐటీఐ రోడ్డులో నివాసం ఉంటున్న వృద్ధురాలు వీరమాచినేని సుశీల ఇంట్లో నిద్రిస్తుండగా లోనికి చొరబడిన దుండగుడు ఆమె మెడలోని బంగారు గొలుసు అపహరించేందుకు యత్నించాడు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచిన ఆమె ప్రతిఘటించేందుకు ప్రయత్నించడంతో బంగారు గొలుసు తెగిపోయింది. దుండగుడి చేతికి చిక్కిన బంగారు గొలుసుతో వెంటనే బైక్‌పై పరారయ్యాడు. ఈ ఘటనపై బాధితురాలు హనుమాన్‌జంక్షన్‌ పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో ఆ రోడ్డులోని సీసీ కెమెరాల ఫుటేజ్‌లను పరిశీలించారు. దుండగుడు రెయిన్‌ కోట్‌, మాస్క్‌ ధరించి ఉండటంతో ముఖం ఆనవాళ్లు పూర్తిగా లభించలేదు. కాగా, చోరికి గురైన బంగారు గొలుసు సుమారు మూడు కాసులు ఉంటుందని బాధితురాలు వాపోయారు.

ఎమ్మెల్యే దగ్గుపాటి బహిరంగ క్షమాపణలు చెప్పాలి 1
1/1

ఎమ్మెల్యే దగ్గుపాటి బహిరంగ క్షమాపణలు చెప్పాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement