
విజయవాడ జీజీహెచ్‌లో అరుదైన ఈఎన్‌టీ సర్జరీ
లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ జీజీహెచ్ ఈఎన్‌టీ విభాగంలో అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. తిరువూరు మండలం వావిలాల గ్రామానికి చెందిన 48 ఏళ్ల చిన్న కృష్ణయ్య శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో ప్రభుత్వాస్పత్రికి వచ్చారు. వైద్యులు అత డిని పరీక్షలు నిర్వహించి, ముక్కు శ్వాసనాళంలో కణితి ఉందని, సర్జరీ చేసి తొలగించాలని నిర్ధారించారు. దీంతో ఈ నెల ఆరో తేదీన రోగికి ఫేషియల్ రీజియన్‌ను ఓపెన్ చేసి ముక్కునాళంలో ఉన్న ఐదు సెంటీమీటర్ల కణితిని తొలగించారు. ఇది చాలా అరుదైనదిగా వైద్యులు పేర్కొన్నారు. శస్త్ర చికిత్స నిర్వహించిన ఈఎన్‌టీ వైద్యులు రవి, డాక్టర్ లీలాప్రసాద్ తదితరులను ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఏ వెంకటేశ్వరరావు అభినందించారు.