పెనమలూరు: సిద్ధార్థ అకాడమీ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ ప్రో వైస్ చాన్సలర్ డాక్టర్ ఏవీ రత్నప్రసాద్‌కు ప్రతిష్టాత్మకమైన ఇండియన్ సొసైటీ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఐఎస్‌టీఈ) అవార్డు వచ్చింది. ఈ నెల 14న మదనపల్లెలో ఐఎస్‌టీఈ స్టేట్‌స్టూడెంట్ కన్వెక్షన్ అవార్డు ఫంక్షన్ కార్యక్రమంలో ఐఎస్‌టీఈ ఏపీ స్టేట్ అవార్డు బెస్ట్ ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా –2024గా డాక్టర్ రత్నప్రసాద్ అవార్డు అందుకున్నారు. డాక్టర్ రత్నప్రసాద్ 2014–2024 కాలంలో వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్‌కాలేజీ ప్రిన్సిపాల్‌గా అనేక రంగాల్లో అపూర్వమైన సేవలు అందించి విజయాలు సాఽధించారు. ప్రస్తుతం ప్రో వైస్ చాన్సలర్‌గా సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా ‘సిద్ధార్థ’ వైస్ చాన్సలర ప్రొఫెసర్ పి.వెంకటేశ్వరరావు, యాజమాన్యం, అధ్యాపకులు, సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు.
ఏపీయూడబ్ల్యూజే వ్యవస్థాపక దినోత్సవం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఏపీ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) 69వ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా జరిగింది. ప్రెస్‌క్లబ్ వద్ద ఆదివారం యూనియన్ నాయకులు ఏపీయూడబ్ల్యూజే పతాకాన్ని ఆవిష్కరించారు. యూనియన్ వ్యవస్థాపకుడు మణికొండ చలపతిరావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయరాజు మాట్లాడుతూ ఏపీయూడబ్ల్యూజే 68 ఏళ్ల ప్రస్థానంలో జర్నలిస్టుల సమస్యలెన్నింటినో పరిష్కరించడంలో కృషి చేసిందన్నారు. ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు ఏచూరి శివ, ఐజేయూ కౌన్సిల్ సభ్యుడు ఎస్‌కే బాబు, విజయవాడ యూనిట్ అధ్యక్షుడు చావా రవి, కార్యదర్శి దారం వెంకటేశ్వరరావు, ప్రెస్ క్లబ్ కార్యదర్శి దాసరి నాగరాజు, ఏపీఏజేఏ అధ్యక్షుడు విజయభాస్కర్, కౌన్సిల్ సభ్యుడు రఘురాం పాల్గొన్నారు.
కారు ఢీ.. వ్యక్తి దుర్మరణం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కారు ఢీ కొట్టడంతో చికెన్ షాపులో పనిచేసే వ్యక్తి మృతి చెందిన ఘటన భవానీపురం స్వాతి థియేటర్ సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భవానీపురం అవుట్ ఏజెన్సీకి చెందిన శంకరరావు(35) స్వాతి సెంటర్‌లోని న్యూ స్టార్ చికెన్ షాపులో పని చేస్తున్నాడు. శనివారం రాత్రి 10 గంటల సమయంలో షాపు నుంచి ఇంటికి వచ్చి భోజనం చేశాడు. మరుసటి రోజు ఆదివారం కావడంతో 10.30 గంటల సమయంలో షాపులో పని ఉందని ఇంట్లో చెప్పి కాలినడకన వెళ్లాడు. ఆ సమయంలో ఇబ్రహీంపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్లే కారు అతివేగంగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో శంకరరావు తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య రేణుక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

సిద్ధార్థ ప్రో వైస్ చాన్సలర్‌కు ఐఎస్‌టీఈ అవార్డు