
అద్భుతం.. అపూర్వం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఏరా ప్రసాద్.. బాగున్నావా?.. ఏంటిరా మహేష్ ఏం చేస్తున్నావు? .. అంటూ 32 ఏళ్ల నాటి జ్ఞాపకాలను వారంత నెమరువేసుకున్నారు. అపూర్వ కలయిక .. అద్భుతం అంటూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఆదివారం భవానీపురం క్రాంబ్వే రోడ్డులోని క్యాస్రోల్ హోటల్లో విద్యాధరపురం దళవాయి సుబ్బరామయ్య మున్సిపల్ హైస్కూల్ 1992–93 బ్యాచ్ పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం జరిగింది. తమకు విద్యా బుద్దులు నేర్పిన గురువులు రామరాజు(సోషల్), వెంకటేశ్వరరావు( పీఈటీ)లను ఘనంగా సత్కరించారు. ఉపాధ్యాయులు శోభనాచలపతిరావు, పెదబాబూరావు మాస్టార్లు జూమ్‌లో అటెండ్ అయి తమ పూర్వ విద్యార్థులను ఆశీర్వదించారు. రీయూనియన్ సందర్భంగా పూర్వ విద్యార్థులు ఆడుతూ పాడుతూ సరదాగా గడిపారు. టీకేఎన్వీ ప్రసాద్, దాది మహేష్, వినోద్పాల్, మున్వర్ బాషా, ముజీబ్‌పాషా, అన్నవరపు మురళీకృష్ణ తమ బ్యాచ్‌కు చెందిన వారి నంబర్లు సేకరించి రీయూనియన్ చేశారు. క్లాసులు ఎగ్గొట్టి ఆడుకున్న ఆటలు, అలనాటి అనుభూతులు, ఆప్యాయలతో తెలియని అనుబంధం పెనవేసుకున్న మనం మళ్లీ 32 వసంతాల తర్వాత కలవడం ఓ అద్భుతం’ అని పూర్వ విద్యార్థులు భావోద్వేగానికి గురయ్యారు. పాఠశాల అభివృద్ధికి సహాయం చేయాలని వారు నిర్ణయించుకున్నారు.
దళవాయి సుబ్బరామయ్య మున్సిపల్
హైస్కూల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం