
చిత్రకళతో సృజన పెంపు
కృష్ణలంక(విజయవాడతూర్పు): చిత్రకళతో సృజనాత్మకత పెంపొందుతుందని అమరావతి బుద్ధ విహార్ ప్రధాన కార్యదర్శి శుభకర్ మేడసాని చెప్పారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్‌పేటలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో ఫోరం ఫర్ ఆర్టిస్ట్, అమరావతి బాలోత్సవం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన రంగ్ తరంగ్ చిత్రకళా పోటీలకు విశేష స్పందన లభించింది. పోటీల్లో మూడు నుంచి ఐదో తరగతి విద్యార్థులు జాతీయ చిహ్నాలు, 6,7 తరగతి విద్యార్థులు భారత దేశ స్మారక చిహ్నాలు, 8,9,10 తరగతుల విద్యార్థులు భిన్నత్వంలో ఏకత్వం అనే అంశాలపై చిత్రాలు వేశారు. అనంతరం బహుమతీ ప్రదానోత్సవం జరిగింది. శుభకర్ మాట్లాడుతూ అద్భుతమైన చిత్రాలు వేసిన విద్యార్థులను ప్రశంసించారు. రోటరీ క్లబ్ మిడ్‌టౌన్ సెక్రటరీ నాగ వసంతకుమార్ మాట్లాడుతూ పిల్లలను ప్రోత్సహిస్తున్న ఫోరమ్ ఫర్ ఆర్టిస్ట్, అమరావతి బాలోత్సవం నిర్వాహకులను కొనియాడారు. కార్యక్రమంలో మోడరన్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ కె.వెంకట సునీల్‌చంద్, ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ నాయకులు ఎ.సునీల్‌కుమార్, అరసవిల్లి గిరిధర్, శ్రావణ్‌కుమార్, అమరావతి బాలోత్సవం కార్యదర్శి యు.వి.రామరాజు, కవి అనిల్ డ్యానీ తదితరులు పాల్గొన్నారు.

చిత్రకళతో సృజన పెంపు