
సాక్షి ఫొటోగ్రాఫర్లకు కన్సొలేషన్ బహుమతులు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీల్లో ప్రదర్శించిన ఛాయా చిత్రాలు ప్రతిఒక్కరిలో ఆలోచనలు రేకెత్తించేలా ఉన్నాయని, ప్రతి ఛాయాచిత్రం కళాత్మక సందేశాన్ని అందిస్తోందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీల్లో విజేతల వివరాలను శనివారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఆయన విడుదల చేశారు. విజేతలకు ఈ నెల 19న నిర్వహించనున్న అంతర్జాతీయ ఫొటోగ్రఫీ దినోత్సవ కార్యక్రమంలో నగదు బహుమతితో పాటు ప్రశంసాపత్రం, జ్ఞాపికలను అందజేసి సత్కరించనున్నట్లు తెలిపారు. బెస్ట్ న్యూస్ పిక్చర్ విభాగంలో సాక్షి మీడియా నుంచి ఎన్.కిశోర్, కె.చక్రపాణిలకు ప్రోత్సాహక బహుమతులు లభించాయి.

సాక్షి ఫొటోగ్రాఫర్లకు కన్సొలేషన్ బహుమతులు