
సమాచార హక్కు పోటీల పోస్టర్ ఆవిష్కరణ
మధురానగర్(విజయవాడసెంట్రల్): ఆంధ్రప్రదేశ్ కళాశాల విద్య ఆధ్వర్యాన రాష్ట్ర స్థాయిలో సమాచార హక్కుపై నిర్వహించే పోటీల పోస్టర్‌ను బుధవారం రాష్ట్ర సమాచార కమిషనర్ శ్యామూల్ జోనాథన్ ఆవిష్కరించారు. సమాచార హక్కుచట్టంపై రాష్ట్రవ్యాప్తంగా వివిధ స్థాయిల్లో వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్ పోటీలు జరిగాయి. రాష్ట్ర స్థాయి పోటీల పోస్టర్‌ను బుధవారం ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.భాగ్యలక్ష్మితో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జోనాథన్ మాట్లాడుతూ.. సమాచార హక్కుపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు ఈ పోటీలు దోహదపడతాయని పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. కళాశాల విద్య ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి పోటీలను ఈ నెల 11న ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తామని తెలిపారు. విజేతలకు రాష్ట్ర సమాచార కమిషనర్ శ్యాముల్ జోనాథన్ చేతులమీదుగా బహుమతులు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పోటీల కన్వీనర్ బాలసుబ్రహ్మణ్యం, కోకన్వీనర్ కొల్లేటి రమేష్, సభ్యులు యుగంధర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.