ఘనంగా పంచరత్న కృతుల గోష్టిగానం
విజయవాడ కల్చరల్ : సద్గురు త్యాగరాజ స్వామి జయంతి సందర్భంగా దుర్గాపురంలోని శివరామకృష్ణ క్షేత్రంలో నిర్వహిస్తున్న సంగీతోత్సవాలు ఆదివారం ముగిసాయి. త్యాగరాజ స్వామి రచించిన ఘనరాగ పంచరత్న కీర్తనలను సంగీత విద్వాంసులు, యువ సంగీత కళాకారులు ఆలపించారు. జగదానందకారక, దుడుగల నన్నే, సాధించెనే ఓ మనసా, కనకన రుచిరా, ఎందరో మహానుభావులను మధురంగా ఆలపించారు. మల్లాది సూరిబాబు, మల్లాది సోదరులు, గౌరీనాథ్, గాయత్రి గౌరీనాఽథ్, శ్రీరాం చరణ్ , మోదుమూడి సుధాకర్ అంజనా సుధాకర్ , ఎన్‌సీహెచ్ కృష్ణమాచార్యులు, చిట్టాకార్తీక్, విష్ణుభొట్ల సొదరీమణులు, లంకా తేజస్విని, మల్లాది కార్తీక త్రివేణి, చారుమతి పల్లవితోపాటు 200 మంది సంగీత విద్వాంసులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా నాట్యాచార్యుడు చింతారవి బాలకృష్ణ బృందం కూచిపూడి సంప్రదాయంలో త్యాగరాజ స్వామికి నృత్య నీరాజనాలు సమర్పించారు.
ముగిసిన త్యాగరాజ స్వామి జయంతి ఉత్సవాలు


